తమిళ విలన్ ను వివాహమాడనున్న టాలీవుడ్ హీరోయిన్..ఎవరో తెలుసా..!

తమిళ విలన్ ను వివాహమాడనున్న టాలీవుడ్ హీరోయిన్..ఎవరో తెలుసా..!

by Sunku Sravan

Ads

మోడల్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది విమలారామన్. మలయాళ ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించిన ఆమె తెలుగులో కూడా అనేక సినిమాలు చేసింది. కులు మనాలి, ఎవరైనా ఎప్పుడైనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, రాజు, చట్టం పలు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Video Advertisement

కోలీవుడ్ లో విలన్ మరియు హీరోగా చేస్తున్నటువంటి వినయ్ రాయ్ తో భగ్నప్రేమ లో ఉన్న విమల కొద్ది రోజుల్లోనే అతనితో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా వెలువడే అవకాశం దగ్గర్లోనే ఉంది.

vimala 1

గత కొన్నేళ్లుగా వినయ్,విమల ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తరచుగా వీళ్ళిద్దరూ టూర్లకు కూడా వెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో మాల్దీవులు వెళ్లిన వీరు దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

vimala 2

ఇక వినయ్ రాయ్ విషయానికి వస్తే మాత్రం ఉన్నాలే ఉన్నాలే అనే మూవీ తో తమిళ తెరకు పరిచయం అయ్యాడు. మొదటి మూవీతోనే ఎంతో క్రేజ్ ను సంపాదించిన ఈ హీరో ఎండ్రేద్రం పున్నాగై, జయం కొందాన్, వంటి సినిమాల్లో హీరోగా నటించారు. తుప్పరివాలను మూవీలో హీరో విశాల్ ను ఢీకొట్టి విలన్ గా అదరగొట్టాడు. ఈటీ, డాక్టర్ వంటి సినిమాల్లో నెగిటివ్ పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను దోచాడు. ప్రస్తుతం ఆయన హీరో సూర్య నిర్మిస్తున్న ఓ మై డాగ్ సినిమాలో ముఖ్య పాత్రలో చేస్తున్నాడు.

https://www.instagram.com/p/CHlAjY_DtyF/?utm_source=ig_web_copy_link


End of Article

You may also like