Ads
లైఫ్ ని పాజిటివ్ గా థింక్ చేసేందుకు.. రెగ్యులర్ రొటీన్ లైఫ్ లో చిన్న చేంజ్ ను చూపించేందుకు చాలా మంది ఎంచుకునే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్. ఆడటానికి కాదు.. చూడడానికి కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. అందుకే స్పోర్ట్స్ అనేది సినిమా వారికీ కూడా బెస్ట్ ఛాయస్. ఈ థీమ్ లో వచ్చిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆ సినిమాలేంటో మనం ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 గురు
ఈ సినిమాలో ఓ కూరగాయలు అమ్ముకునే అమ్మాయి ఇంటర్నేషనల్ బాక్సర్ గా ఎలా ఎదిగిందో చూపిస్తారు. కోచ్ గా వెంకీ మామ అదుర్స్ అంతే.
#2 భీమిలి కబడ్డీ జట్టు:
ఇది నిజానికి తమిళ రీమేక్. తమిళం లో సూపర్ హిట్ అయినా కబడ్డీ కుళుని సినిమా ను తెలుగు లో రీమేక్ చేసారు. నాచురల్ స్టార్ నాని కి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా. అయితే, క్లైమాక్స్ లో నాని చనిపోవడం మాత్రం ట్రాజెడీ.
#3 ఒక్కడు:
ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ కి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా. ఈసినిమాలో మహేష్ కబడ్డీ ప్లేయర్ గా నటించారు.
#4 కౌసల్య కృష్ణమూర్తి
ప్రముఖ దివంగత నటుడు రాజేష్ కుమార్తె ఐశ్వర్య రాజేష్ “కౌసల్య కృష్ణమూర్తి” సినిమాలో నటించారు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ ఓ మాములు పల్లెటూరి అమ్మాయి ఎలా నిరూపించుకుందనే కధాంశం తో ఈ సినిమా ను రూపొందించారు.
#5 జెర్సీ
నాచురల్ స్టార్ నాని క్రికెటర్ గా నటించిన మరో స్పోర్ట్స్ థీమ్ సినిమా “జెర్సీ” ఈ సినిమా ఎంతలా కనెక్ట్ అయిపోయిందో కొత్త గా చెప్పక్కర్లేదు అనుకుంట.
#6 సై
కాలేజీ డేస్ అంటేనే మంచి జోరెక్కించే డేస్. అలాంటి కాలేజీ డేస్ లో చదువుకునే కుర్రాళ్ళు అందరు కలిసి సిటీ లో ఓ పెద్ద గుండా తో తలపెడితే.. వారిపై గెలవడానికి వారో ఆటల పోటీ పెట్టుకుంటే.. ఆ కిక్ మాములుగా ఉండదు.. ఈ సినిమా చుస్తే వచ్చే కిక్ కూడా అలాంటిదే.
#7 గొల్గొండ హై స్కూల్
స్కూల్ డేస్ కాంపిటీషన్స్ ను ఈ సినిమా గుర్తుకు తెస్తుంది. స్కూల్ డేస్ తమ స్కూల్ ప్లే గ్రౌండ్ ని కాపాడుకోవడానికి, స్కూల్ కి మంచి నేమ్ తేవడానికి పిల్లల టీం అంతా కలిసి క్రికెట్ ఆడి గెలుస్తుంది. ఈ సినిమా మనకే కాదు.. మన పేరెంట్స్ కి కూడా బాగా కనెక్ట్ అయిపొయింది.
#8 తమ్ముడు
బాక్సింగ్ ప్రధానాంశం గా రూపొందిన పవర్ స్టార్ సినిమా “తమ్ముడు”. అంత ఈజీ గా ఈ సినిమాని మర్చిపోగలమా చెప్పండి.
#9 బావ
సిద్ధార్థ్, ప్రణీత హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన సినిమా బావ. ఇందులో సైకిల్ పోటీలు ఉంటాయి. ఇందులో బావ మరదళ్ల ప్రేమలో గెలవాలంటే.. సైకిల్ పోటీలో విజయం సాధించాల్సిందే.
#10 కబడ్డీ కబడ్డీ
జగపతి బాబు నటించిన ఈ సినిమా చాలా కామెడీ గా నడిచిపోతుంది. కబడ్డీ గేమ్ ప్రధానాంశం గా ఈ సినిమా రూపొందింది.
#11 భద్రాచలం
శ్రీహరి హీరో గా నటించిన స్పోర్ట్స్ థీమ్ సినిమా భద్రాచలం. ఈ సినిమా లో శ్రీహరి టైక్వాండో ప్లేయర్ గా కనిపిస్తారు. ఈ సినిమా కూడా శ్రీహరి కి మంచి పేరు తెచ్చిపెట్టింది.
#12 మజిలీ
టాలీవుడ్ లవ్లీ కపుల్ నాగ చైతన్య, సమంత జంట గా వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమా లో నాగ చైతన్య క్రికెట్ ప్లేయర్.
#13 అమ్మానాన్న ఓ తమిళమ్మాయి
రవితేజ కెరీర్ లో ఇది ఓ మంచి సినిమా. ఆసిన్, రవితేజ ఇందులో జంటగా నటించారు. ఈ సినిమా లో రవితేజ బాక్సర్ గా నటించారు.
#14 అశ్విని
పిటి ఉషను పరుగుపందెం లో ఓడించిన అశ్విని ఆ తరువాత కొన్ని సినిమాలు చేసారు. “అశ్విని” అనే సినిమాలో కూడా ఆమె రన్నర్ గా నటించారు.
#15 మనసారా:
కేరళ సాంప్రదాయ క్రీడా కలరిపయట్టు పోటీ నేపధ్యం లో సాగే సినిమా “మనసారా”.
End of Article