Ads
హీరోల చే డామినేట్ చేయబడుతున్న తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మహానటిగా గుర్తింపు పొంది హీరోలకు దీటుగా నటించిన నటి సావిత్రి. ఆమె క్రేజ్ ఎంత గొప్పగా ఉండేదంటే ఒక సినిమా కోసం హీరో కాల్ షీట్స్ కంటే ముందు ఆమె కాల్స్ షీట్స్ కోసం డైరెక్టర్ ఆమె ఇంటి ముందు పడిగాపులు పడేవారు. కొన్ని సందర్భాల్లో అగ్ర హీరోల కంటే కూడా సావిత్రి రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకునే వారట.
Video Advertisement
కానీ అంత గొప్ప నటనా ప్రతిభ ఉన్న ఆమెకు మహానటి అన్న ఒక బిరుదు తప్ప ఇంకా ఎటువంటి పురస్కారాలు ,అవార్డులు లభించకపోవడం దురదృష్టకరం.
కీర్తి కిరీటాలు అందుకునే సమయంలో కుటుంబ కారణాలవల్ల వ్యసనాలకు బానిసై అనారోగ్యం పాలైంది సావిత్రి. ఎంతోమంది అభిమానాన్ని అందుకున్న సావిత్రి తన కుమాలోకి వెళ్లే ముందు మాత్రం ఒక చివరి కోరిక కోరిందట…అది ఏమిటో అనుకుంటున్నారా…తాను చనిపోయాక తన సమాధిపై ఏమని రాయాలో వివరించి చెప్పిందట.
“మరణంలోనూ, జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వతమైన విశ్రాంతిని పొందుతుంది.ఇక్కడికి వచ్చినవారు సానుభూతితో తమ కన్నీళ్ళని విడవనక్కర్లేదు. ఈ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకు చిహ్నంగా ఒక పూమాలను ఉంచండి,ఇదే మీరు నాకు ఇచ్చే గౌరవం ” అని రాయించమని కోరిందట.నిజజీవితంలో ఎన్నడు తలవంచక ఆత్మాభిమానంతో బతికిన సావిత్రి చని పోయిన తర్వాత కూడా తన స్వాభిమానం తనని వినకూడదు అని కోరుకోవడం సహజమే కదా.
End of Article