ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళతో జంట కట్టిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళతో జంట కట్టిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

ఈ ఫోటో లో కనిపిస్తున్న ఇద్దరు అక్క చెల్లెళ్లను గుర్తు పట్టారా..? ఒకరు రాధిక. మరొకరి పేరు నిరోష. ఆమె రాధికకు చెల్లెలు అవుతారు. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళతో వెండితెరపై జంట కట్టిన ఒకే ఒక స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఆయన మరెవరో కాదు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.

Video Advertisement

మెగాస్టార్ చిరంజీవి 1978 లో “ప్రాణం ఖరీదు” సినిమాతో రంగ ప్రవేశం చేసారు. ఆ సినిమాకు క్రాంతి కుమార్ దర్శకత్వం వహించారు. ఆయనే ఆ సినిమాకి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు.

radhika 1

కాగా, ఆ సినిమా తరువాత మరొక సినిమాను కూడా చిరంజీవితో చేయాలి అని క్రాంతి కుమార్ నిర్ణయించుకున్నారు. ఆయన నిర్మాణంలో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో “న్యాయం కావాలి” అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో రాధిక, చిరంజీవి హీరో, హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు కోదండ రామిరెడ్డి చిరంజీవి తో కలిసి సినిమా చేయడం ఇది మొదటి సారి. అలాగే.. రాధిక-చిరంజీవిలు కూడా జంటగా నటించడం ఇది మొదటిసారి.

radhika 2

వీరి పెయిర్ హిట్ కావడంతో తరువాత చాలా కాలం పాటు వీరి కాంబో కొనసాగింది. రాధిక-చిరు జంటగా పట్నం వచ్చిన పతివ్రతలు, శివుడు శివుడు, శివుడు, న్యాయం కావాలి, ప్రేమ పిచ్చోళ్ళు, కిరాయి రౌడీలు, పులి బెబ్బులి, ఊరికి మొనగాడు, జ్వాలా, ఇది పెళ్లంటారా, మొండి ఘటం.. ఇలా చెప్పుకుంటే చాలా సినిమాల్లోనే కలిసి నటించారు. దాదాపు 1990 వరకు వీరు కలిసి నటించారు.

radhika 3

1988 లో రాధిక చెల్లెలు నిరోష మణిరత్నం దర్శకత్వంలో ఓ తమిళ సినిమా ద్వారా వెండితెరకి పరిచయమయ్యారు. ఆ తరువాత నారి నారి నడుమ మురారి, మహాజనానికి మరదలు పిల్ల, మధురానగరిలో, బుజ్జిగాడు బాబాయ్, కొబ్బరి బొండం, అసాధ్యులు, వన్ బై టూ, భలే ఖైదీలు లాంటి సినిమాలలో నటించారు. ఆ తర్వాత 1991 లో యండమూరి వీరేంద్ర నాథ్ దర్శకత్వంలో విజయశాంతి, నిరోష హీరోయిన్లుగా, మెగాస్టార్ హీరోగా “స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్” సినిమా విడుదల అయ్యింది. అలా, రాధిక, నిరోష లతో నటించిన ఏకైక స్టార్ హీరోగా చిరు నిలిచారు.


End of Article

You may also like