రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయినట్లేనా..?

రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయినట్లేనా..?

by Anudeep

Ads

టాలీవుడ్ లో సెటిల్ అయిన ముంబై భామ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బాలీవుడ్ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కి వచ్చిన కొత్తల్లో వరుస అవకాశాలతో అగ్రతారగా కొనసాగింది. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల పక్కన చేసింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడం తో బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ఈ భామ కు అక్కడ అవకాశాలు కూడా ఎక్కువే వస్తున్నాయి.

Video Advertisement

rakul 2

అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్ లు ప్రధాన పాత్రలుగా “మే డే” చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో ముంబై భామ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక గా నటిస్తోంది. మరో సినిమా “థాంక్ గాడ్” లో అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా లో కూడా రకుల్ నటిస్తోంది. ఈ రెండు కాకుండా మరో సినిమా ‘డాక్టర్ జి’ సినిమాలో కూడా నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్ సంతకం పెట్టేసిందట.

rakul 1

ఈ సినిమా లో ఆయుష్మాన్ ఖురానా సరసన ఆమె నటిస్తోంది. ఈ సినిమా లో ఆమె డాక్టర్ గా నటించనుందట. ఈ సినిమా కి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారట. జంగిల్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. ఇటీవలే, ఈ చిత్ర యూనిట్ లోకి రకుల్ ని ఆహ్వానిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇందుకు రిప్లై గా ఈ సినిమాలో నటించడానికి చాల ఎక్సయిటింగ్ గా ఉన్నట్లు రకుల్ పేర్కొంది. మొత్తానికి రకుల్ బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.


End of Article

You may also like