Ads
భారత్ లో సినీ, వ్యాపార రంగాలలోనే కాకుండా రాజకీయ నాయకులలో కూడా ధనవంతులు ఉన్నారు. ప్రజా ప్రతినిధులుగా పనిచేసే నాయకుల ఆస్తులు మరియు ఆదాయానికి సంబంధించిన ప్రశ్న తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఆ విషయాలు ప్రజలలో కూడా ఆసక్తిని కలిగిస్తుంది.
Video Advertisement
చాలా మంది పొలిటికల్ లీడర్లు గణనీయమైన ఆస్తులను సంపాదించారు. విలాసవంతమైన ఎస్టేట్‌లు, విస్తృతమైన కార్లు, విలువైన ఆస్తులను కలిగిఉన్నారు. గత ఏడాది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి నిర్వహించిన సమగ్ర అధ్యయనం ద్వారా దేశంలో టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేలు ఎవరో వెల్లడించింది. ఆ పదిమంది ఎమ్మెల్యేలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. డీకే శివకుమార్:
కర్ణాటక కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ఆయన ఆస్తుల విలువ రూ. 1,413 కోట్లు.
2. KH పుట్టస్వామి గౌడ:
ఈ లిస్ట్ లో రెండవ స్థానంలో కర్ణాటకలోని గౌరీబిదనూర్ ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి గౌడ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.1,267 కోట్లు.
3. ప్రియాకృష్ణ:
ఈ లిస్ట్ లో మూడవ స్థానంలో కర్ణాటకలోని గోవింద్‌రాజ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియా కృష్ణ నిలిచారు.25 ఏళ్ల వయసులో 2009లో ఎమ్మెల్యేగా గెలిచి, అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా ఘనత సాధించారు. ఆయన ఆయన ఆస్తుల విలువ 1,156 కోట్ల రూపాయలకు పైగా ఉందని తెలుస్తోంది.
4. నారా చంద్రబాబు నాయుడు:
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ లిస్ట్ లో నాలుగవ స్థానంలో ఉన్నారు. ఆయన 1995-2004 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా, ఆ తర్వాత 2014- 2019 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా చేశారు. ప్రస్తుతం ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన సంపద విలువ రూ.668 కోట్లు.
5. జయంతీభాయ్ సోమాభాయ్ పటేల్:
బీజేపీ ఎమ్మెల్యే సోమాభాయ్ పటేల్ ఎలెక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.661 కోట్లు.
6. BS సురేష్ బైరతి:
బైరతి సురేష్ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు మరియు హెబ్బాల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.648 కోట్లు.
7. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి:
వైఎస్ జగన్మోహన్ రెడ్డి (యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి) ఈ లిస్ట్ లో ఏడవ స్థానంలో నిలిచారు.ఆయన 2019 మే నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.510 కోట్లు.
8. పరాగ్ షా:
పరాగ్ కిశోరచంద్ర షా బీజేపీతో అనుబంధంగా ఉన్న భారతీయ రియల్ ఎస్టేట్ డెవలపర్ మరియు రాజకీయ నాయకుడు. అతను 2019లో ఘట్కోపర్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆస్తుల విలువ రూ. 500 కోట్లు.
9. TS బాబా:
ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి త్రిభువనేశ్వర్ శరణ్ సింగ్ డియో . ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అంబికాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 3 సార్లు గెలుపొందారు. ఆయన ఆస్తుల విలువ రూ. 500 కోట్లకు పైగా ఉందని తెలుస్తోంది.
10. మంగళ్ ప్రభాత్ లోధా, బీజేపీ
మంగళ్ ప్రభాత్ లోధా ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిగా పనిచేస్తున్నారు. దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే. ఆయన ఆస్తి విలువ రూ. 441 కోట్లు.
Also Read: తెలంగాణ ఎమ్మెల్యేలలో… 100 కోట్లకి పైగా ఆస్తులు ఉన్న 6 మంది ఎమ్మెల్యేలు వీరే..!
End of Article