తెలంగాణ ఎమ్మెల్యేలలో… 100 కోట్లకి పైగా ఆస్తులు ఉన్న 6 మంది ఎమ్మెల్యేలు వీరే..!

తెలంగాణ ఎమ్మెల్యేలలో… 100 కోట్లకి పైగా ఆస్తులు ఉన్న 6 మంది ఎమ్మెల్యేలు వీరే..!

by Mohana Priya

Ads

రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు ఉంటారు. ఒక్కొక్క నాయకుడు లేదా నాయకురాలు ఒక్కొక్క పదవిలో ఉండి దేశానికి సేవ చేస్తూ ఉంటారు. అయితే మన తెలంగాణలో కూడా అలా ఎంతో మంది నాయకులు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వారిలో కొంత మంది ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

Video Advertisement

అయితే మన రాష్ట్రంలో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ దాదాపు 100 కోట్ల పైగా ఉంది. మన రాష్ట్రంలో మొత్తంగా 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఆరుగురు ఎమ్మెల్యేల ఆస్తి 100 కోట్లకు పైగా ఉంటుంది అని నామినేషన్స్ సమయంలో ఎన్నికల కమిషన్‌కు అందించిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నట్టు సమాచారం. అలా 100 కోట్లకు పైగా ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 వివేకానంద్ – 600 కోట్లు

ఎలక్షన్స్ కి నెల రోజులు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు వివేకానంద్. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం నుంచి వివేకానంద్ ఎన్నికయ్యారు. వివేకానంద్ ఆస్తుల విలువ 600 కోట్లకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది. వివేకానంద్ విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ గా ఉన్నారు. ఆయన భార్య భార్య సరోజ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. వివేకానంద్ వయసు 66 సంవత్సరాలు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పట్టా కూడా పొందారు. 2009 లో కాంగ్రెస్ టికెట్ మీద పెద్దపల్లి నుండి లోక్ సభకి ఎన్నికయ్యారు. వివేకానంద్ దివంగత జి. వెంకటస్వామి కుమారుడు.

#2 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – 458 కోట్లు

అత్యంత సంపన్నులైన ఎమ్మెల్యేలలో రెండవ స్థానంలో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈయన ఆస్తుల విలువ 458 కోట్లగా తెలిసింది. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుండి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్నికలకి నెల రోజుల ముందు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

#3 పొంగులేటి శ్రీనివాసరెడ్డి – 434 కోట్లు

కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్తుల విలువ 434 కోట్లు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుండి ఎన్నికలలో గెలుపొందారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు చేశారు అంటూ బీఆర్‌ఎస్‌చే సస్పెండ్ చేయబడ్డారు. ఆ తర్వాత జులైలో కాంగ్రెస్‌లో చేరారు.

#4 పి.సుదర్శన్ రెడ్డి – 102 కోట్లు

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అయిన పి.సుదర్శన్ రెడ్డి సంపద దాదాపు 102 కోట్లకు పైగా ఉంది అని సమాచారం. బోధన్ నియోజకవర్గం నుండి పి.సుదర్శన్ రెడ్డి ఎన్నిక అయ్యారు.

richest mlas in telangana

#5 జి.వినోద్ – 197 కోట్లు

వివేకానంద్ సోదరుడు అలాగే మాజీ మంత్రి అయిన జి.వినోద్ ఆస్తుల విలువ కూడా 197 కోట్లు అని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన జి.వినోద్ బెల్లంపల్లి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

richest mlas in telangana

#6 కె.ప్రభాకర్ రెడ్డి – 197 కోట్లు

దుబ్బాక నుంచి ఎన్నికైన మెదక్ ఎంపీ కె.ప్రభాకర్ రెడ్డి ఆస్తుల విలువ 197 కోట్లు. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న క్లబ్‌లో చేరిన ఏకైక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కె.ప్రభాకర్ రెడ్డి గుర్తింపు పొందారు.

richest mlas in telangana

వీరు మాత్రమే కాకుండా 50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

# కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మల్లారెడ్డి గారి ఆస్తుల విలువ 95.93 కోట్లుగా ప్రకటించినట్టు సమాచారం.

# మల్లారెడ్డి గారి అల్లుడు, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఎన్నికైన అయిన మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఆస్తులు 97 కోట్లు.

# గ్రేటర్ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నికైన బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరెకపూడి గాంధీ ఆస్తుల విలువ 85 కోట్లు ఉంటుంది.

# ఇదే పార్టీకి చెందిన, గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ నుండి ఎన్నికైన బి.లక్ష్మారెడ్డి ఆస్తుల విలువ కూడా 85 కోట్లు.

వీరిలో అత్యంత ధనికులైన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లు. ఒకరు బీఆర్‌ఎస్‌ కి చెందినవారు. అయితే స్వల్ప ఆస్తులు ఉన్న వాళ్ళలో ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.

# ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వెడ్మ బొజ్జు ఆస్తుల విలువ 24 లక్షల రూపాయలు.

# దేవరకొండ నుండి ఎన్నికైన బాలు నాయక్ ఆస్తుల విలువ 28 లక్షలు.

# అలాగే అశ్వారావుపేట నుంచి ఎన్నికైన ఆదినాయరాం జారే ఆస్తుల విలువ 56 లక్షలుగా తెలుస్తోంది.

ALSO READ : “నా భార్య పరువు తీయద్దు” అంటూ…తండ్రిపై ఫైర్ అయిన “రవీంద్ర జడేజా”.! అసలేమైంది.?


End of Article

You may also like