తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ 10 సినిమాలు రీమేక్ లే…ఏ సినిమా నుంచి రీమేక్ చేసారో చూడండి..!

తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ 10 సినిమాలు రీమేక్ లే…ఏ సినిమా నుంచి రీమేక్ చేసారో చూడండి..!

by Anudeep

Ads

సినిమా ప్రేక్షకులకు చాలా సార్లు భాషతో సంబంధం ఉండదు. సినిమా ను అర్ధం చేసుకోవాలంటే భాష కావాలి.. ప్రేమించడానికి అక్కర్లేదు. అందుకే.. ఇతర భాషల్లో సినిమాలను కూడా లోకల్ భాషల్లోకి డబ్ చేస్తుంటారు. సినిమా బాగా హిట్ అయితే.. రీమేక్ చేస్తుంటారు. అలా తెలుగు లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. బాలీవుడ్ నుంచి తెలుగు లోకి రీమేక్ అయిన టాప్ 10 సినిమా లిస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Video Advertisement

#1 గబ్బర్ సింగ్- దబాంగ్

1 gabbar sing dabang
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి మంచి మాస్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు చాలా హెల్ప్ అయింది. ఈ సినిమా బాలీవుడ్ దబాంగ్ కి రీమేక్.

#2 గోపాల గోపాల – ఓ మై గాడ్

2 gopala gopala
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ లు నటించిన మల్టీ స్టారర్ సినిమా “గోపాల గోపాల” . లార్డ్ కృష్ణ కాన్సెప్ట్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సినిమా ని తీశారు. దేవుడి కి నాస్తికుడి కి మధ్య జరిగే వివాదాన్ని, దేవుడి పేరు చెప్పుకుని దోపిడీ చేసే బాబాలపై ఓ నాస్తికుడు చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. ఈ సినిమా బాలీవుడ్ లోని ఓ మై గాడ్ సినిమా కి రీమేక్. ఇందులో లార్డ్ కృష్ణ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించారు.

#3 బిల్లా – డాన్

3 billa
ప్రభాస్, అనుష్క హీరో హీరోయిన్లు గా నటించిన బిల్లా సినిమా కూడా బాలీవుడ్ “డాన్” కి రీమేక్. ఈ సినిమా డాన్ అంత విజయం సాధించకపోయినా మంచి టాక్ నే తెచ్చుకుంది. ఒరిజినల్ డాన్ సినిమాని తెలుగు నేటివిటీ కి తగ్గట్లు మోడిఫై చేయడం తో కొంత ఒరిజినాలిటీ దెబ్బతింది.

#4 దృశ్యం – దృశ్యం

4 drushyam
మీనా, విక్టరీ వెంకటేష్ జంట గా నటించిన దృశ్యం సినిమా తెలుగునాట, తమిళనాట కూడా బాగా ఆకట్టుకుంది. కానీ, ఇది మలయాళం దృశ్యం సినిమా కి రీమేక్.

#5 చంద్రముఖి – మణిచిత్రతజ్హు

5 chandramukhi
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమా చంద్రముఖి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు.ఈ సినిమా మలయాళం లోని మణిచిత్రతజ్హు సినిమాకి రీమేక్. తమిళనాట కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

#6 ఈనాడు- ఏ వెడ్నెస్ డే

6 eenadu
విక్టరీ వెంకటేష్, కమల హాసన్ నటించిన మల్టీ స్టారర్ సినిమా ఈనాడు. ఇది కూడా బాలీవుడ్ లోని ఏ వెడ్నెస్ డే కి రీమేక్. ఈ సినిమా బాలీవుడ్, టాలీవుడ్ రెండింటిలోనూ సూపర్ హిట్ అయింది. కోపం వస్తే.. ఒక కామన్ మాన్ ప్రభుత్వాన్ని ఎలా కదిలించగలడన్న కధనం తో ఈ సినిమా ను రూపొందించారు.

#7 బాడీ గార్డ్- బాడీ గార్డ్

7 body guard
రొమాంటిక్ కామెడీ జోనర్ లో ఈ సినిమా ను రూపొందించారు. అదే పేరు తో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఈ సినిమా ను రీమేక్ చేసారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించగా, టాలీవుడ్ లో ఆ పాత్రను విక్టరీ వెంకటేష్ పోషించారు. టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్, త్రిష జంటగా నటించారు. బాలీవుడ్ లో సల్మాన్, కరీనా జంటగా నటించారు.

#8 ప్రేమమ్ – ప్రేమమ్

8 premam
మలయాళం లో సూపర్ హిట్ అయినా ప్రేమమ్ సినిమాను అదే పేరు తో తెలుగు లో కూడా రీ మేక్ చేసారు. ఈ రీ మేక్ లో శృతి హాసన్, నాగ చైతన్య జంటగా నటించి అలరించారు. ప్రేమమ్ లో ఉన్న అనుపమ పరమేశ్వరన్,మడోన్నా లు తెలుగు రీమేక్ లో ఉన్నారు. సాయి పల్లవి పాత్రను మాత్రం శృతి హాసన్ పోషించారు.

#9 శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ – మున్నా భాయ్ ఎం.బి.బి.ఎస్

9 sankardada mbbs
మెగాస్టార్ చిరంజీవి హీరో గా వచ్చిన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సూపర్ హిట్ అయింది. వాస్తవానికి ఇది బాలీవుడ్ సినిమా మున్నా భాయ్ ఎం.బి.బి.ఎస్ కి రీమేక్. కామెడీ ఎమోషనల్ ఫామిలీ డ్రామా గా ఈ సినిమా ను తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రీకాంత్, చిరంజీవి కలిసి నటించారు.

#10 అనామిక – కహాని

10 anamika kahani
బాలీవుడ్ సినిమా కహాని ని తెలుగు లో అనామిక గా దర్శకుడు శేఖర్ కమ్ముల రీమేక్ చేసారు. ఈ సినిమాలో కథానాయిక గా నయనతార లీడ్ రోల్ పోషించారు. అయితే, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఆల్రెడీ తెలిసిన సినిమా కావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా కలెక్షన్లు సాధించలేదు.


End of Article

You may also like