Ads
సినిమా ఇండస్ట్రీ కి ఎల్లలు లేవు.. క్రియేటివ్ కంటెంట్, టాలెంట్ ఉండాలే కానీ భాషను పక్కన పెట్టి మరీ సినిమాలను ఆదరిస్తారు. అలా ఆదరించడానికి కారణం తెలుగు సినిమాలు ఇతర భాషల్లోనూ, ఇతర సినిమాలు తెలుగు భాషలోనూ రీమేక్ కావడమే. రీమేక్ సినిమాలు ఒకప్పుడు పట్టించుకునే వారు కాదు కానీ.. ఇప్పుడు మాత్రం అన్ని భాషల్లో విడుదల అవుతున్న సినిమాలను తెలుసుకోవడం, చూడడానికి తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.
Video Advertisement
అలా తమిళ హీరో లు కూడా తెలుగు నాట పాపులర్ అవుతున్నారు. ఒకప్పుడు తమిళ హీరో విజయ్ కు తెలుగు లో అంత పాపులారిటీ లేదు. తమిళనాట మాత్రం విజయ్ కి ఎంత క్రేజ్ ఉందొ తెలుస్తూనే ఉంది. అయితే.. ఇటీవల “తుపాకీ”, “జిల్లా”, ” మాస్టర్” వంటి సినిమాలతో తెలుగులోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం విజయ్ కి పదిహేను కోట్ల వరకు మార్కెట్ ఉంది.
ఈ క్రమం లో విజయ్ తెలుగు లో డైరెక్ట్ సినిమా చేయడానికి కూడా రెడీ అయిపోయాడు. “మహర్షి” సినిమా దర్శకుడు వంశి పైడిపల్లి దర్శకత్వం లో తెలుగు, తమిళ భాషల్లో విజయ్ సినిమా చేయనున్నారు. ఈ సినిమా గురించి ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది. అయితే.. విజయ్ తమిళ్ లో చేసిన సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తే హిట్ అయ్యాయి. అవేంటో ఓ లుక్ వేద్దాం..
#1 కత్తి – ఖైదీ 150
#2 శివకాశి – విజయదశమి
#3 తుల్లత మనమం తుల్లుమ్ – నువ్వు వస్తావని
#4 లవ్ టుడే – సుస్వాగతం
#5 ప్రియముదన్ – ప్రేమించే మనసు
#6 పూవె ఉనక్కాగ – శుభాకాంక్షలు
#7 తిరుమలై – గౌరీ
#8 తిరుపచి – అన్నవరం
#9 ఖుషి – ఖుషి
End of Article