Ads
ఒకప్పుడు సినిమా హిట్, రికార్డ్స్ గురించి చెప్పడానికి ఆ సినిమా థియేటర్లో ఎన్ని రోజులు ఆడింది అన్న లెక్క మాత్రమే ఉండేది. ఇప్పుడు యు ట్యూబ్ లో వచ్చే వ్యూస్, టీజర్లు, ట్రైలర్లకు వచ్చే రెస్పాన్స్, ఆఖరుకు టివి లో వచ్చాక, టిఆర్పి రేటింగ్స్ లెక్క కూడా కొలమానం గానే నిలుస్తోంది. అలా.. టాప్ 10 టిఆర్పి రేటింగ్స్ సాధించిన 10 సినిమాల లిస్ట్ ను ఇప్పుడు ఓ లుక్ వేద్దాం..
Video Advertisement
#10 రంగస్థలం:
రామ్ చరణ్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన సినిమా రంగస్థలం. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి మంచి టిఆర్పి రేటింగ్ వచ్చింది. ఈ చిత్రానికి వచ్చిన టిఆర్పి రేటింగ్ 19.5 .
#9 మహానటి:
సీనియర్ నటి సావిత్రిని మనం ఇప్పటికీ మర్చిపోలేం. ఆమె జీవితగాదాను తెరకెక్కించి మహానటి చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి వచ్చిన టిఆర్పి రేటింగ్ 20.21 .
#8 జనతా గ్యారేజ్
ఎన్టీఆర్ హీరో గా, సమంత హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి వచ్చిన టిఆర్పి రేటింగ్ 20.69.
#7 గీత గోవిందం:
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం లో రష్మిక, విజయ్ దేవరకొండ జంటగా నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి వచ్చిన టిఆర్పి రేటింగ్ 20.8.
#6 ఫిదా:
శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఫిదా. సాయి పల్లవి, వరుణ్ తేజ్ ఈ సినిమాలో జంటగా కనిపించారు. ఈ చిత్రానికి వచ్చిన టిఆర్పి రేటింగ్ 21.31.
#5 బాహుబలి:
బాహుబలి సినిమా గురించి ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. సిల్వర్ స్క్రీన్ దుమ్ము దులిపి తెలుగు సినిమా స్థాయి ని ఇంటర్నేషనల్ వరకు తీసుకెళ్లింది. ఈ చిత్రానికి వచ్చిన టిఆర్పి రేటింగ్ 21.54.
#4 దువ్వాడ జగన్నాధం:
అల్లు అర్జున్, పూజ హెగ్డే జంట గా నటించిన సినిమా దువ్వాడ జగన్నాధం. ఈ సినిమా కూడా మంచి టిఆర్పి రేటింగ్ నే తెచ్చుకుంది. ఈ చిత్రానికి వచ్చిన టిఆర్పి రేటింగ్ 21.7.
#3 శ్రీమంతుడు:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సినిమా శ్రీమంతుడు. ఈ చిత్రానికి వచ్చిన టిఆర్పి రేటింగ్ 22.54.
#2 బాహుబలి ది కంక్లూషన్:
బాహుబలి పార్ట్ వన్ కు కొనసాగింపు గా వచ్చిన సినిమా నే బాహుబలి ది కంక్లూషన్. ఈ చిత్రానికి వచ్చిన టిఆర్పి రేటింగ్ 22.7.
#1 సరిలేరు నీకెవ్వరు:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వచ్చిన టిఆర్పి రేటింగ్ 23.4.
End of Article