Ads
భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ ఇండస్ట్రీ టాలీవుడ్. గత 2-3 ఏళ్ల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తోంది తెలుగు సినిమాలే. ఈ ఏడాది అలా మొదలవగానే 5 చిత్రాలకు పైగా సూపర్‌హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ సినిమాల పరంగా ఈ 2023లో తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికే మిగతా ఇండస్ట్రీల కన్నా ముందుంది.
Video Advertisement
అయితే ఒకవైపు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సూపర్ హిట్ చిత్రాలు వస్తుంటే.. మరోవైపు రెగ్యులర్ కథలతో పలు కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. అయితే వాటిని ప్రేక్షకులు ఆదరించకపోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. వాటిల్లో ముఖ్యం గా చెప్పుకోవాల్సిన చిత్రాలు ఏజెంట్, శాకుంతలం.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీపై ప్రకటన సమయం నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు దీన్ని ఏకంగా రూ. 85 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఫలితంగా భారీ అంచనాలతో అత్యధిక లోకేషన్లలో ఈ సినిమా విడుదలైంది. అయితే దీనికి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. ఏజెంట్ మూవీ టోటల్ రన్ లో 6.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.
అలాగే గుణశేఖర్ దర్శకత్వం లో సమంత హీరోయిన్ గా వచ్చిన చిత్రం శాకుంతలం. ఈ మూవీ 65 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బానే వచ్చాయి కానీ .. బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ చిత్రం టోటల్ గా 4.32 కోట్ల షేర్ ని సన్తం చేసుకొని నిర్మాతలకు భారీ నష్టాన్ని ఇచ్చింది.
మొత్తమ్మీద భారీ అంచనాలతో.. సుమారు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు 10% కూడా రికవరీ ని కూడా సొంతం చేసుకోలేదు. బడ్జెట్ పరంగా రెండు సినిమాలు కలిపి నష్టం 138 కోట్ల రేంజ్ లో నష్టాన్ని మూటగట్టుకున్నాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ తో మేజర్ అమౌంట్ సేఫ్ అయినా కూడా ఈ రెండు భారీ చిత్రాల వాళ్ళ నిర్మాతలు, బయ్యర్లు నష్టపోయారు.
End of Article