Ads
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఈ మాట అక్షర సత్యం. పాతది ఎప్పుడైనా సరే మురిపెంగానే ఉంటుంది. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రూపాయి కి వ్యాల్యూ లేకుండా పోతోంది. దీంతో ప్రజలు ముఖ్యంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు పూటలా కడుపు నిండా తినేందుకూ అష్ట కష్టాలు పడుతున్నారు. దీంతో పాత రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుండు అని అనుకుంటుంటారు చాలా మంది. నిజానికి కొన్నేళ్ల క్రితం ధరలు చాలా తక్కువగా ఉండేవి. అప్పటి పరిస్థితులను బట్టి ధరలు ఉన్నా.. అవి ఇప్పుడు మనకు చాలా తక్కువ అనిపిస్తాయి.
Video Advertisement
పది రూపాయలతో నెలకు సరిపడా సరకులు కొనుక్కునే వాళ్లంటే అతిశయోక్తి లేదు. అదే.. ఇప్పుడు పది రూపాయలకు కనీసం సింగిల్ టీ కూడా రాదు. దీంతో చాలా మంది అప్పటి ధరలు.. ఇప్పటి ధరలను పోలుస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. అవి క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 1915 సంవత్సరానికి చెందిన ఒక ట్రైన్ టికెట్ ఒకటి వైరల్ గా మారింది.
ట్రెండింగ్ లో ఉన్న ఆ టికెట్ నవంబర్ 4 , 1915 నాటిది. స్వాతంత్య్రం రావడానికి ముందు నాటి ఆ టికెట్ ని పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి పాకిస్థాన్ లోని లాహోర్ కంటోన్మెంట్ కి తీసుకున్నారు. అప్పట్లో ఆ టికెట్ ధర కేవలం మూడు రూపాయలు మాత్రమే. అయితే మనకి ఇప్పుడు ఆ విలువ తక్కువగా అనిపిస్తోంది కానీ.. అప్పట్లో మూడు రూపాయలు కూడా పెద్ద మొత్తమే.
అప్పటి కాలం ఎలా ఉండేది, అప్పటి మనుషులు ఎలా బతికేవారు వంటి వివరాలను తెలిపే ఈ పాత కాలం నాటి వస్తువులు, కాగితాలు, బిల్లులను ప్రజలు అపురూపంగా చూసుకుంటారు. ఈ నేపథ్యం లోనే ఈ టికెట్ ని ఆసక్తి కలిగినవారు కొనుక్కోవచ్చని వారి వివరాలు అందులో ఇచ్చారు. ఒక బ్లాగ్ లో ఈ వివరాలను ప్రచురించగా ఈ పోస్ట్ వెంటనే చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
End of Article