Ads
మహేశ్ … ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది అని ఏదో సినిమాలో కలర్స్ స్వాతి అంటుంది..అలా స్వాతికి కూడా తెలియని విషయం ఒకటుంది అదేంటంటే..మంచు లక్ష్మీ … ఆ పేరులోనే ఒకటి కాదు వందలు వేల వైభ్రేషన్స్ ఉన్నాయి.. సోషల్ మీడియాను ఆమె టచ్ చేసిందంటే ఆ వైబ్రేషన్స్ నెటిజన్ వరల్డ్ లో వైరల్ కే వైరల్ తెప్పిస్తాయి.. ఏం చెప్తున్నానో అర్దం కావట్లేదా…క్లియర్ గా చెప్తా..
Video Advertisement
మంచులక్ష్మీ వాయిస్ కి ఉన్నంత క్రేజ్ , ఈ వాయిస్ వైరలైనంతగా మరేది వైరల్ కాలేదంటే అతిశయోక్తి కాదు.ఈ మధ్య ఆమె కరోనా కాదది..కొర్రోనా… ఆర్ షుడ్ బి రోల్.. కిందపడి దొర్లాలన్నమాట అని అన్న యాంగిల్లో..ఎన్నో టిక్ టాక్లు సోషల్ మీడియాలో వైరలై ఎన్నో నవ్వులు పూయించాయి..ఇప్పుడు తను ట్విటర్లో పెట్టిన ఒక పోస్టు, దానికి ఒక నెటిజన్ చేసిన రీట్వీట్ ..దానికి లక్ష్మి కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.. చిన్న సైజు యుద్దమే నడిచింది ఇద్దరి మధ్యా..
“అమ్మా, మాలి పూవులు పెట్టింది.. ఫ్లవర్స్ ఫ్రం అవర్ గార్డెన్ అంటూ ఒక ట్వీట్ చేసింది మంచులక్ష్మి..ట్వీట్ తో పాటు ఒక ఫోటో కూడా.. ఆట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ .. మాలి కాదు అది ఇట్స్ మల్లె అంటూ ఒక ట్వీట్ చేసాడు..” ఒక నెటిజన్.. దానికి మంచక్క పోబే అని కౌంటర్ ఇస్తే.. మనోడు తగ్గకుండా పోరా అంటూ రిప్లై ఇచ్చాడు..ఇంకేంటి ట్రోల్ చేయడానికి ఒక టాపిక్ దొరికింది.. ఇక దీనిపై రకరకాల ట్రోల్స్ , మీమ్స్ నడిచాయి.
చివరికి మంచు లక్ష్మి మంచు ఆ ట్వీట్ తీసేసి..మాలి,మల్లి,మల్లె, మల్లెపూవు ఏదో ఒకటి.. ఫోటోని ఎంజాయ్ చేయండి..అసలు అది పలకడానికి నాకు స్కూల్ ,కాలేజ్ డేస్ నుండి కూడా కష్టమే.. అది నా డిటర్మినేషన్ మాత్రమే, ఇంగ్లీష్ ,టింగ్లీష్ కాదు..ఊరికే అంటూ మరో ట్వీట్ చేసింది.. మొన్న నిలదీస్ ఫై..ఇప్పుడు మాలి… హాహాహా..ఆ ఇష్యూపై వచ్చిన ట్రోల్స్ చదువుకుని ఒకసారి నవ్వుకోండి.
End of Article