తెలుగు ఇండస్ట్రీలో గత ఏడాది నుండి రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. పాత చిత్రాలను 4కె లోకి మార్చి వాటిని థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ ట్రెండ్ పోకిరి సినిమాతో మొదలయ్యింది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాని రీరిలీజ్ చేశారు.

Video Advertisement

ఆ మూవీకి  అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో వరుసగా పాత సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే తాజాగా కల్ట్ క్లాసిక్ మూవీగా పేరు గాంచిన 7జి బృందావన్ కాలనీ రీరిలీజ్ అయ్యింది. ఈ మూవీ పై సోషల్ మీడియాలో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. తెలుగు స్టార్ హీరోల సినిమాలకి రీరిలీజ్ లో మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో ఫ్యాన్స్ స్పెషల్ షోలుగా రీరిలీజ్ చేయడం మొదలుపెట్టారు. తెలుగులో డబ్ అయిన సినిమాలకు కూడా రీరిలీజ్ లో రెస్పాన్స్ వచ్చింది. కోలీవుడ్ హీరో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్, ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమాలకు రీరిలీజ్ లో అద్భుతమైన ఆదరణ వచ్చింది. దాంతో ఈ రోజు కల్ట్ క్లాసిక్ 7జి బృందావన్ కాలనీ రీరిలీజ్ చేశారు.
2004 లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూవీతో పాటు, అందులోని సాంగ్స్ కు అప్పటి యూత్ ఫిదా అయ్యారు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ తెలుగులోనూ సంచలన విజయాన్ని సాధించింది.
కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిన ఈ సినిమాని ఇప్పటికి టీవీలలో ప్రసారం అయితే చూడటానికి ఇష్టపడతారు. 7జి బృందావన్ కాలనీ రీరిలీజ్ కోసం మూవీ యూనిట్ ప్రమోషన్లు చేసింది. హీరోయిన్ సోనియా అగర్వాల్ తో పాటు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు. ఇక ఈ మూవీ రీరిలీజ్ పై నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ను మీరు చూసేయండి..

1.
2. 3. 4. 5. 6. 7.8.
9.
10. 11. 12. 13. 14. 15. 16. 17.18.

Also Read: SAPTA SAGARALU DHAATI (SIDE A) REVIEW : “రక్షిత్ శెట్టి” కి ఈ సినిమాతో మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!