చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల అయ్యింది. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు. దాని తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులని నిరాశపరిచింది.

Video Advertisement

దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. లూసిఫర్ సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా కూడా సినిమా అంతా బలమైన కథతో నడుస్తుంది. సినిమాకి కథ పెద్ద ప్లస్ పాయింట్. దాంతో ఈ సినిమా రీమేక్ ఆయిన గాడ్ ఫాదర్ లో కూడా మెయిన్ పాయింట్ లో పెద్దగా మార్పులు చేయలేదు.

Trending memes on chiranjeevi god father movie getting hit talk

కానీ మలయాళంలో మోహన్ లాల్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది. తెలుగులో మాత్రం చిరంజీవి దాదాపు 2 గంటల పాటు సినిమాలో కనిపిస్తారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా చాలా విషయాలను సినిమాలో మార్చారు. కానీ మెయిన్ పాయింట్ మాత్రం అలాగే ఉంచారు. ఇది సినిమాకి ఒకరకంగా ప్లస్ అని చెప్పవచ్చు. మలయాళం సినిమాలో లాగానే తెలుగు సినిమాలో కూడా చాలా పెద్ద పెద్ద నటులు ఉన్నారు. కానీ వారంతా కథ ముందుకు వెళ్లడానికి ఉపయోగపడ్డారే తప్ప, సినిమా చూస్తున్నంత సేపు స్టార్స్ లాగా అనిపించరు. ప్రస్తుతం ఈ సినిమాకి హిట్ టాక్ వస్తోంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18