Ads
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్లు డుప్లెసిస్ (0), రుతురాజ్ గైక్వాడ్ (5) తక్కువ స్కోర్ కి అవుటయ్యారు.
Video Advertisement
తర్వాత వచ్చిన మొయిన్ అలీ (36: 24 బంతుల్లో 4×4, 2×6), సురేశ్ రైనా (54: 36 బంతుల్లో 3×4, 4×6) మూడవ వికెట్ కి 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్ లో సురేష్ రైనా హాఫ్ సెంచరీ నమోదు చేశారు. చివరిలో శామ్ కరన్ (34: 15 బంతుల్లో 4×4, 2×6) దూకుడుగా ఆడారు. మిడిల్ ఓవర్లలో అంబటి రాయుడు (23: 16 బంతుల్లో 1×4, 2×6) చేయగా, మహేంద్ర సింగ్ ధోనీ (0: 2 బంతుల్లో) చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్ రెండు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్, టామ్ కరన్ ఒక వికెట్ పడగొట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 188 పరుగుల స్కోర్ చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్లు శిఖర్ ధావన్ (85: 54 బంతుల్లో 10×4, 2×6), పృథ్వీ షా (72: 38 బంతుల్లో 9×4, 3×6) తొలి వికెట్ కి 13.3 ఓవర్లలో 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు జట్టు స్కోర్ 138 దగ్గర ఉన్నప్పుడు అవుటయ్యారు. తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ (15 నాటౌట్: 12 బంతుల్లో 2×4)తో కలిసి ఢిల్లీ టీమ్ ని శిఖర్ ధావన్ ముందుకు నడిపించారు.
జట్టు స్కోర్ 167 దగ్గర ఉన్నప్పుడు శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్ లో వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా ఉన్నప్పుడు దొరికారు శిఖర్ ధావన్. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టాయినిస్ (14: 9 బంతుల్లో 3×4) మూడు బౌండరీలు కొట్టి అవుట్ అవ్వగా శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లోనే ఫోర్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలుపు లాంఛనాన్ని రిషబ్ పంత్ పూర్తి చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.4 ఓవర్లలో 190/3 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
End of Article