Ads
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి, కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి మధ్య గురువారం జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. కోల్కతా ఇన్నింగ్స్ ని శుభమన్ గిల్ (43: 38 బంతుల్లో 3×4, 1×6) తో కలిసి ప్రారంభించిన ఓపెనర్ నితీశ్ రాణా (15: 12 బంతుల్లో 1×4, 1×6) ఇన్నింగ్స్ 4 వ ఓవర్ లో వికెట్ చేజార్చుకున్నారు.
Video Advertisement
తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (19: 17 బంతుల్లో 2×4) స్లో బ్యాటింగ్ తో నిరాశపరచగా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0), సునీల్ నరైన్ (0) స్కోర్ చేశారు. మిడిల్ ఓవర్లలో దినేశ్ కార్తీక్ (14: 10 బంతుల్లో 1×4, 1×6) తో కలిసి కోల్కతా ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించారు ఆండ్రీ రసెల్ (45 నాటౌట్: 27 బంతుల్లో 2×4, 4×6). చివరిలో పాట్ కమిన్స్ (11: 13 బంతుల్లో 1×4)తో కలిసి ఆండ్రీ రసెల్ భారీ షాట్ ఆడారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 154 పరుగుల స్కోర్ చేసింది.
155 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ పృథ్వీ షా (82: 41 బంతుల్లో 11×4, 3×6) సంచలన ఇన్నింగ్స్ ఆడారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన శివమ్ మావీ బౌలింగ్ లో పృథ్వీ షా వరుసగా ఆరు బంతుల్నీ బౌండరీకి తరలించారు. ఇంకొక ఓపెనర్ శిఖర్ ధావన్ (46: 47 బంతుల్లో 4×4, 1×6) స్కోర్ చేశారు. పృథ్వీ షా కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 16.3 ఓవర్లలో 156 పరుగుల స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని ఈ మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
End of Article