Ads
మహేంద్ర సింగ్ ధోనీ. పరిచయం అక్కర్లేని వ్యక్తి. ధోని కి కేవలం క్రికెట్ లో మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిత్వానికి కూడా చాలా మంది అభిమానులు ఉంటారు. అయితే ధోని ఫ్యాషన్ విషయంలో కూడా ముందుంటారు. ఒక టైంలో ధోని హెయిర్ స్టైల్ ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలుసు. అయితే గత కొద్ది రోజుల నుండి ధోని కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ధోని ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ గడ్డం తో కనిపిస్తున్నారు. ఇదే లుక్ లో ధోనీ ఇటీవల ఒక అడ్వటైజ్మెంట్ షూట్ చేశారు.
Video Advertisement
ఈ అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలని ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ ఫరా ఖాన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఫరాఖాన్ షేర్ చేసిన ఫోటోలో ధోని ఇండియన్ జెర్సీతో కనిపిస్తున్నారు. ధోని కొత్త లుక్ ని ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిం హకీమ్ డిజైన్ చేశారు. ఏదేమైనా ధోని కొత్త లుక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంక ప్రతి సెలూన్లో ఈ హెయిర్ స్టైల్ పిక్చర్స్ ఉంటాయి అని ఇప్పుడు ప్రతి వాళ్లు ధోని కొత్త హెయిర్ కట్ చేయించుకోవాలి అని అనుకుంటారు అని ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
End of Article