ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావంటే చాలా మంది నోటి నుండి వెంటనే వచ్చే సమాధానం ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అంటే చాలా మందికి ఆసక్తిగా అనిపిస్తుంది. అందుకు ఇంజనీరింగ్ లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు, మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది అనే కారణాలు మాత్రమే కాకుండా ఇంజనీరింగ్ లో చేరిన తర్వాత జీవితంలో కూడా చాలా మార్పులు వస్తాయి అనేది కూడా ముఖ్య కారణం. అందుకు ఇంజనీరింగ్ మీద తీసిన సినిమాలు కూడా ఒక కారణమే. ఆ సినిమాలలో ఒక సినిమా మీ అందరికీ ఈపాటికే గుర్తొచ్చి ఉంటుంది.

memes on engineers day

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాకి ఇప్పటికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అందుకు ముఖ్య కారణం అందులో ఎంచుకున్న కాన్సెప్ట్. కొంత మంది వ్యక్తులు ఇంజనీరింగ్ లో చేరడం, తర్వాత వాళ్లు అందరూ ఫ్రెండ్స్ అవ్వడం, ఒక గ్రూప్ లాగా మారడం, అందరూ కలిసి బయటికి వెళ్లడం, ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవడం, ఇలా సినిమాలో చాలా మంచి అంశాలను చూపించారు. సినిమా చూసిన వారంతా ఇంజినీరింగ్ లో ఇలాగే మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు, సినిమాలో చూపించినంత కాకపోయినా నిజజీవితంలో కూడా దగ్గర దగ్గర అలాగే ఉంటుంది అని అనుకొని ఇంజనీరింగ్ ఎంచుకొని ఉంటారు.

memes on engineers day

అందరూ కాకపోయినా కొందరు అయినా సరే ఈ సినిమాను చూసి అదే విధంగా ఆలోచించి ఉంటారు. అది కేవలం సినిమా మాత్రమే అని తర్వాత చాలా మందికి తెలిసి ఉంటుంది. ఏదేమైనా సరే నిజంగానే ఇంజనీరింగ్, చదువుతోపాటు జీవితాన్ని కూడా నేర్పిస్తుంది, కెరియర్ మీద కూడా చాలా మందికి ఇంజనీరింగ్ తర్వాత, లేదా ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడే క్లారిటీ వస్తుంది. అయితే ఇవాళ ఇంజనీర్స్ డే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4
#5#6#7#8#9#10#11