Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ మొదలైన దగ్గర నుండి షూటింగ్ చాలా సార్లు వాయిదా పడడం, మూవీ నుండి హీరోయిన్ తప్పుకోవడం వంటివి జరిగిన తరువాత శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని, సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Video Advertisement
రిలీజ్ దగ్గర పడుతుండడంతో మూవీ నుండి పాటలను, వరుస పోస్టర్లను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ మహేష్, మీనాక్షి చౌదరి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పోస్టర్ పై నెట్టింట్లో పలు మీమ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చితాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుండి సాంగ్స్ ను, వరుస పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. మొదట జనవరి 6 న ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్రకటించారు. కానీ ఈ వేడుకను పోస్ట్ పోన్ చేశామని, త్వరలో డేట్ ప్రకటిస్తామని అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ మూవీ నుండి మెయిన్ హీరోయిన్ శ్రీలల పోస్టర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మరో హీరోయిన్ గా నటించిన కానీ మీనాక్షి చౌదరికి సంబంధించిన ఎలాంటి వివరాలు, పోస్టర్ కానీ రిలీజ్ కాలేదు. ఆమె పాత్ర ఈ మూవీలో ఎలా ఉండబోతుందని, అసలు ఆమె ఈ మూవీలో నటించిందా లేదా అని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ తాజాగా మహేష్ బాబు, మీనాక్షి ఉన్న పోస్టర్ ని విడుదల చేశారు.
ఈ పోస్టర్ లో మహేష్ కూర్చొని ఉన్నాడు. వెనుక మీనాక్షి మహేష్ బాబు పై చేతులు వేసి నిలుచుని ఉంది. ఇక ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. కానీ కొందరికి మాత్రం మీనాక్షీ మహేష్ బాబుకి మసాజ్ చేస్తున్నట్లుగా కనిపించింది. దాంతో మీమర్స్ సరదాగా ఈ పోస్టర్ పై మీమ్స్ క్రియేట్ చేశారు. అవి ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. అవేమిటో మీరు చూసేయండి..
1.
2. 3. 4. 5.6. 7. 8. 9.10.
Also Read: GUESS THE ACTOR: పూర్తిగా రూపు మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!
End of Article