Ads
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాకి టీం ఇండియాకి మధ్య గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో టీమిండియాకు నిరాశే ఎదురైంది. మ్యాచ్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 166/2 చేసింది. వర్షం కారణంగా తొలి సెషన్ ముప్పావు శాతం తుడిచిపెట్టుకుపోవడంతో ఇవాళ కేవలం 55 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయ్యింది. క్రీజ్ లో మార్కస్ లబుషేన్ (67 బ్యాటింగ్: 149 బంతుల్లో 8×4), స్టీవ్‌స్మిత్ (31 బ్యాటింగ్: 64 బంతుల్లో 5×4) ఉన్నారు. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
Video Advertisement
ఓపెనర్ విల్ పకోస్కి (62: 110 బంతుల్లో 4×4)తో కలిసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభించిన డేవిడ్ వార్నర్ (5: 8 బంతుల్లో) మొదటిలోనే వికెట్ చేజార్చుకున్నారు. జట్టు స్కోర్ 6 పరుగుల దగ్గర ఉన్నప్పుడు మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ కి బంతిని పట్టుకుంటూ స్లిప్ లో చతేశ్వర్ పుజారా చేతికి చిక్కారు డేవిడ్ వార్నర్. ఆ తర్వాత లబుషేన్ తో కలిసి ఇవాళ తొలి టెస్టు అవుతున్న పకోస్కి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు.
రెండవ వికెట్ కి లబుషేన్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పకోస్కి తన కెరీర్ లో మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశారు. నిజానికి వ్యక్తిగత స్కోర్ 26, 32 దగ్గర ఉన్నప్పుడు పకోస్కి అవుట్ అయ్యేలా అనిపించారు. కానీ రెండుసార్లు రిషబ్ పంత్ కీపర్ క్యాచ్ లను వదిలేశారు. టీమ్ స్కోర్ 106 దగ్గర ఉన్నప్పుడు నవదీప్ సైనీ, పకోస్కిని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశారు. తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ తో కలిసి లబుషేన్ టీమిండియాకి మరొక టికెట్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12
#13
End of Article