“అంపైర్ బ్లైండ్…గంభీర్ భాయ్ ట్వీట్ ఎఫెక్ట్” అంటూ నాలుగవ T20లో ఇండియా మ్యాచ్ గెలవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్స్.!

“అంపైర్ బ్లైండ్…గంభీర్ భాయ్ ట్వీట్ ఎఫెక్ట్” అంటూ నాలుగవ T20లో ఇండియా మ్యాచ్ గెలవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్స్.!

by Mohana Priya

Ads

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుకి, టీం ఇండియాకి మధ్య జరిగిన నాలుగవ టీ20 మ్యాచ్ లో టీమ్ ఇండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 185 పరుగుల స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ జట్టు 177/8 స్కోర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఓపెనర్లు రోహిత్ శర్మ (12: 12 బంతుల్లో 1×4, 1×6), కేఎల్ రాహుల్ (14: 17 బంతుల్లో 2×4) చేయగా తర్వాత మొదటిసారి బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ (57: 31 బంతుల్లో 6×4, 3×6) స్కోర్ చేశారు.

Video Advertisement

memes on ind vs eng 4th t20

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ టీమ్ స్కోరు 110 దగ్గర ఉన్నప్పుడు అవుటయ్యారు. నాలుగవ స్థానంలో బ్యాటింగ్ ‌కి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (1: 5 బంతుల్లో) చేయగా తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (30: 23 బంతుల్లో 4×4), శ్రేయాస్ అయ్యర్ (37: 18 బంతుల్లో 5×4, 1×6), హార్దిక్ పాండ్య (11: 8 బంతుల్లో 1×6), శార్ధూల్ ఠాకూర్ (10 నాటౌట్: 4 బంతుల్లో 2×4) చేశారు. ఇంగ్లండ్ జట్టు బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ​4 వికెట్లు, ఆదిల్ రషీద్ ఒక వికెట్, మార్క్ ‌వుడ్ ఒక వికెట్, బెన్ ‌స్టోక్స్ ఒక వికెట్, శామ్ కరన్ ఒక వికెట్ పడగొట్టారు.

తర్వాత ఇంగ్లాండ్ జట్టు నుండి ఓపెనర్ జోస్ బట్లర్ (9: 6 బంతుల్లో 1×6) తో పాటు డేవిడ్ మలాన్ (14: 17 బంతుల్లో 1×6) స్కోర్ చేయగా మరో ఓపెనర్ జేసన్ రాయ్ (40: 27 బంతుల్లో 6×4, 1×6) ఫామ్ ‌ని కొనసాగించారు. టీమ్ స్కోరు 66 దగ్గర ఉన్నప్పుడు జేసన్ రాయ్ అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన జానీ బెయిర్‌స్టో (25: 19 బంతుల్లో 2×4, 1×6), బెన్‌స్టోక్స్ (46: 23 బంతుల్లో 4×4, 3×6) స్కోర్ చేశారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (4) స్కోర్ తో అవుట్ అయ్యారు. టీమిండియా బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ మూడు వికెట్లు, రాహుల్ చాహర్ రెండు వికెట్లు, హార్దిక్ పాండ్య రెండు వికెట్లు, భువనేశ్వర్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20#21

#22


End of Article

You may also like