తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో టీం ఇండియాకి జరిగిన మొదటి టి-20లో 8 వికెట్ల తేడాతో ఇండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 106/8 స్కోర్ చేసింది.

Video Advertisement

కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తక్కువ స్కోర్ కే అవుట్ అయినా కూడా, కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 51*), సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50*) జట్టు విజయం సాధించేలా చేశారు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 తో పూర్తి చేసింది.

Trending memes on ind vs sa 1st t20i

మొదట చాలా నెమ్మదిగా అయిన రాహుల్ తర్వాత దూకుడు పెంచారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. కోహ్లీ అవుట్ అయ్యాక బ్యాటింగ్ కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వరసగా సిక్సర్లు కొట్టారు. నోకియా వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్ లో రెండు వరుస బాల్స్‌ ను స్టాండ్స్‌లోకి పంపారు. దాంతో భారత్ స్కోర్ బోర్డ్ ముందుకు వెళ్ళింది. కోహ్లీ 9 బంతుల్లో 3 పరుగులు చేసి పెవీలియన్ చేరారు. అంతకు ముందు రోహిత్ శర్మ డకౌట్‌ గా వెనుదిరిగారు. బౌలర్లు అర్ష్‌దీప్, దీపక్ చాహర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18