Home Sports Adda “కేఎల్ రాహుల్‌పై అలా… విరాట్ కోహ్లీపై ఇలా..!”… IND vs SA మొదటి టెస్ట్ మ్యాచ్‌పై ట్రెండ్ అవుతున్న 11 ట్రోల్స్.!

“కేఎల్ రాహుల్‌పై అలా… విరాట్ కోహ్లీపై ఇలా..!”… IND vs SA మొదటి టెస్ట్ మ్యాచ్‌పై ట్రెండ్ అవుతున్న 11 ట్రోల్స్.!

by Mohana Priya

సెంచూరియన్ వేదికగా సౌత్ ఆఫ్రికాకి, ఇండియాకి మధ్య ఆదివారం జరిగిన మొదటి టెస్ట్ లో కేఎల్ రాహుల్ సెంచరీ చేశారు. 218 బంతుల్లో 14×4, 1×6 సాయంతో 100 పరుగుల మార్క్‌ని అందుకున్నారు కేఎల్ రాహుల్. రాహుల్ కి ఇది టెస్ట్ కెరీర్ లో ఏడవ సెంచరీ.

భారత్ జట్టు 78 ఓవర్లు ముగిసే సమయానికి 238/3తో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60: 123 బంతుల్లో 9×4)తో కలిసి మొదటి వికెట్‌కి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కేఎల్ రాహుల్. ఇన్నింగ్స్ లో 41వ ఓవర్ వేసిన లుంగి ఎంగిడి వరుస బంతుల్లో మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా (0)ని పెవిలియన్ బాట పట్టేలా చేశారు.

Trending memes on ind vs south africa 1st test

ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (35: 94 బంతుల్లో 4×4)తో కలిసి కేఎల్ రాహుల్ మూడో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సంవత్సరం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ లో 129 పరుగులు చేసిన రాహుల్‌ కి, 2021లో ఇది రెండవ సెంచరీ. అంతే కాకుండా ఆసియా వెలుపల అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత ఓపెనర్ గా రాహుల్ నిలిచారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

 

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12

You may also like