Ads
టీ20 వరల్డ్‌కప్ 2021లో సెమీస్‌కి కూడా చేరని టీమిండియా, టీ20 సిరీస్‌లో 3-0తో న్యూజిలాండ్‌ని చిత్తుగా ఓడించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మూడో టీ20లో 73 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
Video Advertisement
ఈ క్రమంలో ఓపెనర్ ఇషాన్ కిషన్ (29: 21 బంతుల్లో 6×4)తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన రోహిత్ శర్మ (56: 31 బంతుల్లో 5×4, 3×6), మొదటి వికెట్ కి 6.2 ఓవర్లలోనే 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
కానీ తర్వాత ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన మిచెల్ శాంట్నర్, ఇషాన్ కిషన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ (0)ని నాలుగు బంతుల వ్యవధిలో అవుట్ చేశారు.
#1
#2
#3
ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (4: 6 బంతుల్లో) కూడా శాంట్నర్ బౌలింగ్‌లోనే భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యారు. కానీ శ్రేయాస్ అయ్యర్ (25: 20 బంతుల్లో 2×4)తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేసిన రోహిత్ శర్మ, ఇస్ సోధీ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు.
#4#5
#6
ఆ తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (20: 15 బంతుల్లో 1×4, 1×6) దూకుడుగా ఆడగా చివరిలో వచ్చిన హర్షల్ పటేల్ (18: 11 బంతుల్లో 2×4, 1×6), దీపక్ చాహర్ (21 నాటౌట్: 8 బంతుల్లో 2×4, 1×6) స్కోర్ చేశారు.
#7#8
#9
దాంతో భారత్ జట్టు 184 పరుగుల స్కోర్ చేసింది. న్యూజిలాండ్ జట్టు బౌలర్లలో మిచెల్ శాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్, ఆడమ్ మిల్నే ఒక వికెట్, లూకీ ఫెర్గూసన్ ఒక వికెట్, ఇస్ సోధీ ఒక వికెట్ పడగొట్టారు.
#10#11
#12
#13
ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#14#15
End of Article