Ads
టీమిండియాతో ఆడిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ బ్యాటర్లు మిరాజ్, మహ్మదుల్లా అద్భుతంగా ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లా బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వాషింగ్టన్ సందర్ సిరాజ్, బౌలింగ్ చేయడం వల్ల బంగ్లాదేశ్ కేవలం 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
Video Advertisement
ఆ టైమ్ లో మిరాజ్, మహ్మదుల్లా కలిసి 7వ వికెట్‌కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఇద్దరి సూపర్ ఇన్నింగ్స్‌ల తో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఇక మిరాజ్ శతకంతో మెరవగా, మహ్మదుల్లా 77 పరుగులతో చేసాడు. ఇక అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పిన వీరిద్దరూ పలు రికార్డులను బద్దలు కొట్టారు.
బంగ్లాదేశ్ ప్లేయర్స్ అద్భుతంగా ఆడారు. మొదట్లో ఆట చూసిన వారు వందలోపే అల్ అవుట్ అవుతారని భావించిన అభిమానులు మ్యాచ్ చూడటం మానేసారు. కానీ ఆట చివర్లో టీవీ ఆన్ చేసిన వారికి షాకయ్యే పరిస్థితి వచ్చింది. 19 ఓవర్లకే ఆరు వికెట్లు పోయి కష్టాల్లో పడిన బంగ్లాదేశ్, 50 ఓవర్లు అయ్యేసరికి ఒక వికెట్ కోల్పోయి 271 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్ మిరాజ్ అద్భుత బ్యాటింగ్ తో 83 బాల్స్ లో సెంచరీ చేశాడు. 8 ఫోర్లు, 4 సిక్సులు చేసాడు. మహ్మదుల్లా 96 బంతుల్లో 77 చేశాడు.
భారత బౌలర్స్ మొదట్లో కట్టుదిట్టమైన బాల్స్ తో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్‌ను బాగానే ఇబ్బంది పెట్టారు. కానీ చివర్లో ఎప్పటి లాగానే అవసరమైన టైమ్ లో చేతులెత్తేశారు. దానీ ఫలితంగా 100 పరుగులే చేయలేయరని భావించిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 271 పరుగులు చేసింది.
ఇండియా పై వన్డే మ్యాచ్ ల్లో 7వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం చేసిన జోడిగా మిరాజ్, మహ్మదుల్లా నిలిచారు. దంబుల్లా వేదికగా 2005లో జరిగిన వన్డేలో శ్రీలంక బ్యాటర్లు ఉపుల్ చందనా, మహేల జయవర్ధనే 7వ వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇప్పటివరకు ఇదే రికార్డు కాగా, తాజాగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 17 ఏళ్ల రికార్డును హసన్, మహ్మదుల్లా బ్రేక్ చేశారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23
#24
End of Article