Ads
గత కొద్ది కాలంగా వరుస విమర్శలతో సతమతమవుతున్న భారత్ జట్టు తన సత్తాను చాటి విమర్శకుల చేతే ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటుంది. అదే పనిగా వాన అడ్డుపడుతున్నా…ఎన్ని ఆటంకాలు వచ్చినా…అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన మ్యాచ్లో వారి ఓపికకు తమ విజయాన్ని టీం ఇండియా కానుకగా ఇచ్చింది.
Video Advertisement
పాక్ బౌలింగ్ కి ఎదురు వెళ్లే సత్తా లేదు అంటూ వచ్చిన విమర్శలను పటాపంచలు చేస్తూ…ఫీల్డ్ లో పరుగుల వర్షం కురిపించారు. ఒకపక్క టీం ఇండియన్ బ్యాట్స్మెన్లు …పరుగుల వర్షం కురుస్తుంటే ఆ ధాటికి ఎంటర్టైన్ అయిన వరుణుడు సైతం మ్యాచ్ ను ఆసక్తిగా చూడడం కోసం తన వర్షాన్ని ఆపేశాడు.
సూపర్ ఫోర్ మ్యాచ్లో తమ ఆధిపత్యాన్ని ఏకపక్షంగా డిక్లేర్ చేస్తూ.. 228 పరుగుల భారీ తేడాతో భారత్ పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి టీమిండియా 356 పరుగులు చేసింది. తన బ్యాట్ కు మరొకసారి పని చెప్పిన విరాట్ కోహ్లీ.. 94 బంతులలో 122 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. రాహుల్ కూడా 106 బంతులలో 111 పరుపులు చేసి మరొక సెంచరీని టీం ఇండియాకు జత చేశాడు.
మ్యాచ్ కి మధ్య మధ్యలో వాన అంతరాయం కలిగిస్తున్న.. మొదలు పెట్టిన వెంటనే తిరిగి పుంజుకొని టీమ్ ఇండియా ఆటగాళ్లు రెచ్చిపోయారు. వాన చినుకులు టపటపా పడ్డట్టు పాకిస్తాన్ ఆటగాళ్ల వికెట్లను కూడా టపటపా పడగొట్టారు. ఈ విజయానికి సంబరపడిపోయిన అభిమానులు సోషల్ మీడియాలను పలు రకాల మీమ్స్ తో నింపేశారు.
మరీ ముఖ్యంగా ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు పెట్టి.. క్యాచీ ట్యాగ్ లైన్స్ తో బాగా పాపులర్ చేశారు. ముఖ్యంగా మొన్న కింగ్ భయపడ్డాడు అని పాకిస్తాన్ అభిమానులు చేసిన మీమ్స్ తో హర్ట్ అయిన క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు తమ స్వీట్ రివెంజ్ తీర్చుకుంటున్నారు.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18
ALSO READ : సీనియర్ ఎన్టీఆర్ గారి చేతిరాత ఎప్పుడైనా చూశారా ? ముత్యాల్లాంటి రాత…అచ్చం ప్రింట్ లాగే.!
End of Article