Ads
ప్రపంచంలో అన్నిటికంటే క్రేజ్ ఎక్కువగా ఉండేది ఒకటి క్రికెట్ కి ఇంకొకటి సినిమాలకి. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ క్రేజ్ అంటే చెప్పడం కష్టమే. క్రికెటర్లకి కూడా సినిమావాళ్ళకి ఉన్నంత ఫాలోయింగ్ ఉంటుంది. అదే మామూలుగా అయినా సరే సోషల్ మీడియాలో అయినా సరే. అందుకే ఎంతోమంది ప్లేయర్లు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న టీమిండియా యువ క్రికెటర్లలో ఒకరైన మయాంక్ అగర్వాల్ కి కూడా సోషల్ మీడియాలో బాగానే ఉంది.
Video Advertisement
మయాంక్ అగర్వాల్ మార్చి 1వ తేదీన సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో మయాంక్ అగర్వాల్ వర్కౌట్ చేస్తున్నారు. క్యాప్షన్ లో ఏదైనా మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. మీరు రోజు ప్రయత్నిస్తేనే మీలో మార్పు మొదలవుతుంది అని అర్థం వచ్చేలాగా రాశారు. అయితే ఈ పోస్ట్ కి న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ “కంగ్రాచ్యులేషన్స్! అమ్మాయా? అబ్బాయా?” అని రిప్లై ఇచ్చారు.
రిప్లై వింతగా ఉందనే విషయం ఈపాటికే మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. ఇలాంటి ఏ విషయం అయినా కూడా సోషల్ మీడియా ఫోకస్ లో పడకుండా ఉండదు. ఇంక అందులోనూ సోషల్ మీడియాలో జరిగిన విషయం అయితే ఖచ్చితంగా అది వైరల్ అవ్వాల్సిందే. అలా మయాంక్ అగర్వాల్ పెట్టిన పోస్ట్ కి జిమ్మీ నీషమ్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6
#7#8#9
#10
End of Article