Ads
పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియమ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి, ముంబై ఇండియన్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు ఓపెనర్లు రోహిత్ 3 (12), ఇషాన్ కిషన్ 14 (21) తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు.
Video Advertisement
తర్వాత వచ్చిన డివాల్డ్ బ్రీవిస్ 19 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 29 పరుగులు చేయగా, ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులు, తిలక్ వర్మ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 27 బంతుల్లో 38 పరుగులు చేయగా, పోలార్డ్ మూడు సిక్సర్లతో 5 బంతుల్లో 22 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. కోల్‌కతా జట్టు బౌలర్లలో పాట్ కమిన్స్ రెండు వికెట్లు, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టారు.
కోల్‌కతా జట్టులో వెంకటేశ్ అయ్యర్ 41 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు పాట్ కమిన్స్ ఆరు పరుగులు, నాలుగు ఫోర్లతో 15 బంతుల్లోనే 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయం సాధించేలా చేశారు. అజిక్య రహానే 7 (11), శ్రేయాస్ అయ్యర్ 10 (6), శామ్ బిల్లింగ్స్ 17 (12), నితీష్ రాణా 8 (7), ఆండ్రీ రసెల్ 11 (5) పరుగుల స్కోర్ చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు, మైల్స్ రెండు వికెట్లు, డానియల్ శామ్స్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article