Ads
షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకి, ముంబై ఇండియన్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో అంతకుముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (24: 19 బంతుల్లో 3×4, 1×6) , యశస్వి జైశ్వాల్ (12: 9 బంతుల్లో 3×4) పవర్ ప్లేలో దూకుడుగా ఆడడానికి ప్రయత్నించారు. కానీ నాలుగవ ఓవర్లో జట్టు స్కోర్ 27 వద్ద యశస్వి అవుట్ కొంచెం సేపటికే లూయిస్ కూడా అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ (3), శివమ్ దూబె (3), గ్లెన్ ఫిలిప్స్ (4), శ్రేయాస్ గోపాల్ (0), చేతన్ సకారియా (6) సింగిల్ డిజిట్ స్కోర్ కే వికెట్లు చేర్చుకున్నారు.
Video Advertisement
మిడిల్ ఓవర్లలో కాసేపు క్రీజ్ లో నిలిచిన డేవిడ్ మిల్లర్ (15: 23 బంతుల్లో), రాహుల్ తెవాటియా (12: 20 బంతుల్లో) జట్టు పరువు నిలపడానికి ప్రయత్నించారు గానీ అతి జాగ్రత్తతో పాటించడంతో రాజస్థాన్ రాయల్స్ దాదాపు 10 ఓవర్ల పాటు కనీసం ఒక బౌండరీ కూడా కొట్టలేకపోయింది. చివరి ఓవర్ లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ (8 నాటౌట్: 7 బంతుల్లో 1×5) ఒక సిక్స్ కొట్టడంతో 90 పరుగుల స్కోర్ చేసింది. ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లలో కౌల్టర్ నైల్ (4/14), జేమ్స్ నీషమ్ (3/12), జస్ప్రీత్ బుమ్రా (2/14) తమ కెరీర్ లోనే ఉత్తమమైన గణాంకాలు నమోదు చేశారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article