గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో కథానాయికగా శృతి హాసన్ నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Video Advertisement

అయితే మే 28వ తేదీ నటుడు నందమూరి తారక రామారావు ( ఎన్టీఆర్) 100 వ జయంతి సందర్భంలో ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో బాలకృష్ణ తెలుపు రంగు దుస్తులు వేసుకొని చేతిలో ఒక ప్రత్యేకమైన కత్తి పట్టుకొని ఎంతో యంగ్ అండ్ డాషింగ్ లుక్కుతో అదరగొడుతున్నాడు.

trending memes on nbk 107 poster

మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ పాత్రలో చేస్తున్నారు. ఇది బాలకృష్ణ సినీ జీవితంలో 107 వ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎక్కడ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సరికొత్తగా కనిపించబోతున్నాడని చెప్పవచ్చు. అయితే సినిమాకి సంబంధించిన టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తామని మూవీ యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పటికే మూవీ కి జై బాలయ్య అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పోస్టర్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11