“ఇప్పుడు ఇండియా ఫ్యాన్స్ హ్యాపీయేగా..?” అంటూ… ASIA CUP 2022 లో “పాక్” ఓడిపోవడంపై 15 మీమ్స్..!

“ఇప్పుడు ఇండియా ఫ్యాన్స్ హ్యాపీయేగా..?” అంటూ… ASIA CUP 2022 లో “పాక్” ఓడిపోవడంపై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

దుబాయ్ వేదికగా పాకిస్తాన్ కి, శ్రీలంకకి మధ్య జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో భానుక రాజపక్సె (71 నాటౌట్: 45 బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీ చేయడంతో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

శ్రీలంక ఓపెనర్లు శ్రీలంక ఓపెనర్లు నిశాంఖ (8), మెండిస్ (0)తో పాటు దనుష్క గుణతిలక (1), దసున్ షనక (2) సింగిల్ డిజిట్ స్కోర్ తో పెవిలియన్ చేరారు. తర్వాత క్రీజ్ లో నిలిచిన రాజపక్సె ధనంజయ డిసిల్వా (28), వానిందు హసరంగా (36)తో శ్రీలంకని ముందుకి తీసుకెళ్లారు. మ్యాచ్‌ లో హసరంగాతో కలిసి 36 బంతుల్లో 58 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన రాజపక్సె, చివరిలో కరుణరత్నెతో కలిసి 31 బంతుల్లోనే 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పాకిస్తాన్ జట్టు బౌలర్లలో హారిస్ రౌఫ్ మూడు వికెట్లు, నసీమ్ షా ఒక వికెట్, షదాబ్ ఖాన్ ఒక వికెట్, ఇప్తికర్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.

trending memes on pak losing asia cup 2022

171 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ప్లేయర్స్ మహ్మద్ రిజ్వాన్ (55: 49 బంతుల్లో 4×4, 1×6), ఇప్తికర్ అహ్మద్ (32: 31 బంతుల్లో 2×4, 1×6) స్కోర్ చేశారు. కెప్టెన్ బాబర్ అజామ్ (5) పేలవ ఫామ్‌ని కొనసాగించగా ఫకార్ జమాన్ (0), మహ్మద్ నవాజ్ (6), ఖుష్‌దిల్ షా (2), ఆసిఫ్ అలీ (0), షదాబ్ ఖాన్ (8) చేశారు. దాంతో 17 ఓవర్‌ లోనే పాకిస్తాన్ ఓడిపోతుంది అని అర్ధమైపోయింది. చివరిలో హారిస్ రౌఫ్ (13), నసీమ్ షా (4) కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. శ్రీలంక జట్టు బౌలర్లలో మధుషాన్ నాలుగు వికెట్లు, వానిందు హసరంగా మూడు ఇట్లు, కరుణరత్నె రెండు వికెట్లు, థీక్షణ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17

#18


End of Article

You may also like