పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకి ముందు భవదీయుడు భగత్ సింగ్ అని పేరు పెట్టారు. సినిమా ప్రకటించారు కానీ ఆ తర్వాత సినిమాకి సంబంధించిన ఒక విషయం కూడా చెప్పలేదు. దాంతో అసలు సినిమా ఉందా ఆగిపోయిందా అని అనుమానాలు కూడా అందరికీ వచ్చాయి.

Video Advertisement

సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా మళ్లీ మీ సినిమా ఎప్పుడు ఉంటుంది అని సినిమా దర్శకుడిని నిర్మాతలని అడగడం మొదలుపెట్టారు. ఇటీవల హరీష్ శంకర్ సినిమాకి సంబంధించి ఒక విషయాన్ని చెప్తాను అని ప్రకటించారు. నిన్న సోషల్ మీడియాలో ఈ సినిమా పేరు ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పారు.

Trending memes on Pawan Kalyan ustad bhagat singh first look poster

ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా నిన్న జరిగాయి. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ప్రేక్షకుల్లో ఈ సినిమాకి సంబంధించి ఇంకో కొత్త అనుమానం మొదలయ్యింది. అదేంటంటే, ఈ సినిమా తమిళ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన తేరి సినిమా రీమేక్ అని అంటున్నారు. ఇదే సినిమా తెలుగులో పోలీసోడు పేరుతో విడుదల కూడా అయ్యింది.

Trending memes on Pawan Kalyan ustad bhagat singh first look poster

సినిమా తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో కూడా హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలీదు. కానీ సినిమా పేరు విని మాత్రం అందరూ సర్దార్ గబ్బర్ సింగ్ గుర్తోస్తోంది అంటున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3#4#5#6#7#8#9#10
#11#12#13#14#15#16#17#18