Ads
ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2022 రెండవవ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఇందులో 6 బాల్స్ మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ బౌలింగ్ ఎంచుకున్నారు.
Video Advertisement
మొదటి ఐదు ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. మెల్లగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కెప్టెన్ ఫా డుప్లెసిస్ బౌండరీలతో స్కోర్ బోర్డ్ ని ముందుకు నడిపించారు. 14 ఓవర్లు ముగిసే సమయానికి 136 పరుగులు స్కోర్ చేశారు.
కెప్టెన్ డుప్లెసిస్ 88 (57) పరుగులు చేయగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 41 (29) పరుగులు చేశారు. చివరిలో వచ్చిన దినేష్ కార్తీక్ భారీ బౌండరీలు బాది 32 (13) స్కోర్ చేశారు.
#1
#2
#3
ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యధిక స్కోర్ నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 205 పరుగుల స్కోర్ చేసింది.
#4#5
#6
206 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 29 (18), శిఖర్ ధావన్ 18 (12) పరుగులు చేశారు. శిఖర్ ధావన్ 43 (29) పరుగులు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 32 (24) దగ్గర అవుటయ్యారు.
#7#8
#9
#10
చివరి 5 ఓవర్లలో జట్టు విజయానికి 50 పరుగులు అవసరం కావడంతో క్రీజ్ లో ఉన్న షారూఖ్ ఖాన్ 24(20), స్మిత్ 25 (8) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
#11#12
#13
దాంతో పంజాబ్ కింగ్స్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 208 పరుగులు స్కోర్ చేసింది.
#14#15
#16
ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#17
#18
End of Article