స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పుష్ప అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి ఇప్పటికే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రెల్యూడ్ ఇటీవల విడుదల అయ్యింది. దాంతో పుష్ప సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగింది. అంతేకాకుండా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు.

trending memes on pushpa teaser

మలయాళం స్టార్ హీరో ఫాహాద్ ఫాసిల్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు. అయితే ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఏప్రిల్ 7వ తేదీన అల్లు అర్జున్ పాత్ర అయిన పుష్ప రాజ్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లో లో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన అలాగే ఇంకొంతమంది నటులు కూడా కనిపిస్తున్నారు.

ఈ వీడియోకి మేజర్ హైలైట్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. అంతేకకుండా కొన్ని సెకండ్ల వీడియో లో ఫైట్స్ తో పాటు విజువల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు. దాంతో అల్లు అర్జున్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఒకరోజు ముందే మొదలయ్యాయి అని చెప్పొచ్చు. ఈ ఇంట్రడక్షన్ వీడియో లాంచ్ కి ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ఇంకొక విషయం కూడా ఎనౌన్స్ చేశారు. అదేంటంటే ఇప్పటివరకు మనందరికీ అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా దగ్గరయ్యారు.

ఇప్పటి నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మనందరినీ అలరిస్తారు అని ఈ ఈవెంట్ ద్వారా డైరెక్టర్ సుకుమార్. ఈ ఈవెంట్ లో దర్శకులు సుకుమార్ తో పాటు, అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు, అల్లు శిరీష్, అలాగే ఇటీవల ఉప్పెన తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన దర్శకులు బుచ్చిబాబు సానా. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఇలా మీమ్స్ తో పుష్ప హవా నడుస్తోంది.

#1

#2#3#4#5#6#7#8#9

#10#11