Ads
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి, రాజస్థాన్ రాయల్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు లో జాస్ బట్లర్ 61 బంతుల్లో 103 పరుగులు చేసి ఈ సీజన్ లో రెండవ సెంచరీ నమోదు చేశారు.
Video Advertisement
తర్వాత పడిక్కల్ 24 (18), కెప్టెన్ సంజూ శాంసన్ 38 (19), రియాన్ పరాగ్ 5 (3), కరుణ్ నాయర్ 3 (5) పరుగులకే పెవిలియన్ బాట పట్టగా, హెట్మెయర్ 26 (13), అశ్విన్ 2 (2) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు, పాట్ కమిన్స్ ఒక వికెట్, ఆండ్రీ రసెల్ ఒక వికెట్, శివమ్ మావి ఒక వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల స్కోర్ చేసింది.
తర్వాత బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదటి బంతికే రనౌట్ రూపంలో సునీల్ నరైన్ వికెట్ కోల్పోయారు. క్రీజ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తో కలిసి ఆరోన్ ఫించ్ రెండో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఫించ్ ప్రషిద్ కృష్ణ బౌలింగ్ లో అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో 51 బంతుల్లో 85 పరుగులు స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన నితీష్ రాణా 11 బంతులు ఆడిన రాణా ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 18 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article