ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో పేరు సంపాదించారు రష్మిక మందన. రష్మిక మొదటి సినిమా కన్నడ లో వచ్చిన కిరిక్ పార్టీ. ఈ సినిమా తెలుగులో కూడా కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో మొదటి హీరోయిన్ పాత్రని రష్మిక పోషించారు. తన మొదటి సినిమాతోనే ఎంతో పాపులారిటీ సంపాదించారు రష్మిక. ఆ తర్వాత కన్నడ లో స్టార్ హీరోలతో నటించారు.

trending memes on rakshit shetty tweet on rashmika birthday

తెలుగులో ఛలో సినిమాతో అడుగుపెట్టిన రష్మిక తర్వాత గీత గోవిందం, దేవదాసు, డియర్ కామ్రేడ్, సరిలేరు నికేవ్వరు, భీష్మ ఇలా వరుస సూపర్ హిట్ లతో దూసుకెళ్తున్నారు. రష్మిక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా లో కూడా నటిస్తున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన సుల్తాన్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టారు రష్మిక.

అంతే కాకుండా మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ గారితో గుడ్ బై సినిమా కూడా చేస్తున్నారు. ఏప్రిల్ ఐదవ తేదీన రష్మిక తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మన మొదటి సినిమా కిరిక్ పార్టీ హీరో అయిన రక్షిత్ శెట్టి రష్మిక ఆడిషన్ వీడియో పోస్ట్ చేసి రష్మిక కి బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో అలాగే ఈ వీడియో పై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12