Ads
దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, ముంబై ఇండియన్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 52 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో దేవదత్ పడిక్కల్ (0: 4 బంతుల్లో)తో కలిసి విరాట్ కోహ్లీ (51: 42 బంతుల్లో 3×4, 3×6) బెంగళూరు ఇన్నింగ్స్ ని ప్రారంభించారు. పడిక్కల్ పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన క్రికెటర్ కేఎస్ భరత్ (34: 24 బంతుల్లో 2×4,2×6) క్రీజ్ లో ఉన్నంత సేపు భారీ షాట్లు ఆడారు.
Video Advertisement
టీమ్ స్కోర్ 126 వద్ద కోహ్లీ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ (11: 6 బంతుల్లో 1×4, 1×6) భారీ షాట్లతో దూసుకెళ్లారు. అతనికి తోడుగా గ్లెన్ మాక్స్వెల్ (56: 37 బంతుల్లో 6×4, 3×6) కూడా భారీ షాట్లు ఆడటంతో బెంగళూరు జట్టు 165 స్కోర్ చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు, ఆడమ్ మిల్నే ఒక వికెట్, రాహుల్ చాహర్ ఒక వికెట్, ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article