Ads
ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, రాజస్థాన్ రాయల్స్ జట్టుకి మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో జాస్ బట్లర్ హాఫ్ సెంచరీ చేయగా, దేవదత్ పడిక్కల్ 37 పరుగులు, హెట్మెయర్ 31 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
Video Advertisement
ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 4 (6), సంజూ శాంసన్ 8 (8) పరుగులకు పెవిలియన్ బాట పట్టారు. చివరి ఓవర్ లో ఆకాష్ దీప్ 23 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 169 పరుగుల స్కోర్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ జట్టు బౌలర్లలో డేవిడ్ విల్లే ఒక వికెట్, వానిన్డ్ హసరంగ ఒక వికెట్, హర్షల్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.
బెంగళూరు జట్టులో ఫా డుప్లెసిస్ 29 (20), అంజు రావత్ 26 (25) మొదటి వికెట్ కి 55 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఫా డుప్లెసిస్ వికెట్ కోల్పోయిన తర్వాత ఆరు పరుగుల తర్వాత మరో ఓపెనర్ రావత్ కూడా అవుట్ అయ్యారు. చాహల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ 5 (6) రనౌట్‌గా వెనుదిరిగిన తర్వాతి బంతే డేవిడ్ విల్లే 0 (2) కూడా బౌల్డ్ అయ్యారు. తర్వాత వచ్చిన రూథర్‌ఫోర్డ్ 5 (10) కూడా వెంటనే అవుట్ అయ్యారు. రాజస్థాన్ జట్టు బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు, యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు, నవదీప్ సైనీ ఒక వికెట్ పడగొట్టారు. దాంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 19.1 ఓవర్లలో 173 పరుగుల స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23
End of Article