“ఓడిపోతే అలా అంటారు…గెలుస్తే ఇలా అంటారు”అంటూ…మహిళల RCB టీం ఐపీఎల్ గెలవడంపై 11 మీమ్స్.!

“ఓడిపోతే అలా అంటారు…గెలుస్తే ఇలా అంటారు”అంటూ…మహిళల RCB టీం ఐపీఎల్ గెలవడంపై 11 మీమ్స్.!

by Mohana Priya

Ads

మహిళల ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మహిళా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని 8 వికెట్ల తేడాతో ఓడించింది. బెంగళూరు జట్టు కప్ గెలుచుకోవడం ఇది మొదటి సారి. ఐపీఎల్ జరిగిన 16 సీజన్లలో బెంగళూరు మేల్ జట్టు ఒక్కసారి కూడా కప్ సాధించలేదు. దాంతో 17 సంవత్సరాల తర్వాత బెంగళూరు జట్టుకి కప్ దక్కడం అనేది అందరూ ప్రశంసించదగ్గ విషయంగా మారింది. దాదాపు 17 సంవత్సరాల నుండి బెంగళూరు టీంకి కప్ దక్కి విజేతగా నిలవడం కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ కల నెరవేరింది.

Video Advertisement

దాంతో సోషల్ మీడియా అంతటా కూడా ఇదే విషయం మీద చర్చించుకుంటున్నారు. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఒక దశలో 64/0 స్కోర్ చేసింది. కానీ తర్వాత జుట్టు తడబడింది. 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఇంక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్లలో,  మోలినెక్స్ 3 వికెట్లు, శ్రేయాంక పాటిల్‌ 3 వికెట్లు, ఆశ శోభన 2 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బరిలోకి దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది.

బెంగళూరు జట్టు బాటర్లలో స్మృతి మంధాన (31), సోఫీ డివైన్ (32), ఎలీస్ పెర్రీ 35 నాటౌట్, రిచా ఘోష్ 17 నాటౌట్‌ గా నిలిచారు. అయితే, ఈ విషయం మీద రెండు రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొంత మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ట్రోఫీ వచ్చింది అని ఆనంద పడుతూ ఉంటే, మరి కొంత మంది మాత్రం మగవాళ్ళ జట్టు చేయలేని పని ఆడవాళ్ళ జట్టు చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్స్ చేయడం వరకు బాగానే ఉంది కానీ, విరాట్ కోహ్లీని ట్రోల్ కూడా చేస్తున్నారు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11


End of Article

You may also like