“ఏంటి..? గుర్రాన్ని కూడా గ్రాఫిక్స్ చేశారా..?” అంటూ… RRR “VFX బ్రేక్‌డౌన్” వీడియోపై 10 మీమ్స్..!

“ఏంటి..? గుర్రాన్ని కూడా గ్రాఫిక్స్ చేశారా..?” అంటూ… RRR “VFX బ్రేక్‌డౌన్” వీడియోపై 10 మీమ్స్..!

by Sunku Sravan

Ads

నందమూరి, మెగా హీరోల కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన జక్కన్న మెగా, నందమూరి అభిమానులకు ఒక మంచి అనుభూతిని మిగిల్చారు అని చెప్పవచ్చు.

Video Advertisement

భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చి 25 వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. సినిమా చూస్తున్నంత సేపు కళ్ళు తిప్పు కోకుండా మెస్మరైజ్ చేశారు జక్కన్న. సినిమా మొత్తం చూస్తుంటే ఇంకా ఏం జరుగుతుందో అనే ఆలోచన తప్ప వేరే మైండ్ లో ఉండదు. అంత ఉత్కంఠగా సాగే ఈ సినిమా చూస్తుంటే చాలా సీన్స్ మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. మరి ఆ సీన్లన్ని వారు రియల్ గానే తీశారా, లేదా గ్రాఫిక్స్ వాడారా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలిగి ఉంటుంది. మూవీ చూస్తే మాత్రం గ్రాఫిక్స్ లా అనిపించదు.

కానీ ఈ సినిమా లో చాలా హయ్యర్ టెక్నాలజీ విఎఫ్ ఎక్స్ వాడారు. అదేంటో ఒకసారి చూస్తే మీరే ఆశ్చర్యపోయి, జక్కన్న మామూలోడు కాదు అనడం ఖాయం. దర్శకుడు రాజమౌళి విజువల్ ఎఫెక్ట్ ని అంత అద్భుతంగా ఉపయోగించడం వల్లే ఈ సినిమా దేశంలోనే బ్లాక్ బస్టర్ గా అవతరించింది. ఆయన ఈ ఒక్క సినిమానే కాదు ఈగ సినిమాతో విఎఫ్ ఎక్స్ ప్రారంభించి, బాహుబలితో అందరిని మెస్మరైజ్ చేసి, ఇక ఆర్ఆర్ఆర్ లో మంత్రముగ్ధులను చేశారు.

 

ఇందులో చాలా సీన్లను చూస్తే మనకు గూస్ బంప్స్ పుడతాయి. ఈ సినిమాలో ట్రైన్ బ్లాస్ట్ సీన్ లో అది నిజంగానే జరిగినట్టు విఎఫ్ఎక్స్ లో చూపించారు. ఒక సన్నివేశంలో గుర్రంపై వచ్చి ఒక బాబు ని కాపాడే సీన్ అక్కడ గుర్రం లేకుండా ఏ విధంగా చేశారు మీరు ఒకసారి గమనించండి. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా రాజమౌళి తన గ్రాఫిక్స్ తో కోట్లాదిమంది వీక్షకులను ఆనందపరిచారని చెప్పవచ్చు.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10


End of Article

You may also like