Ads
హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన ‘యశోద’ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా ఏకంగా ఐదు భాషల్లో ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాని హరి- హరీష్ దర్శకత్వంలో సరోగసి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించారు. ‘ఓ బేబీ’ తర్వాత సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో సమంతకి థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం.
Video Advertisement
శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటించారు. రిలీజైన ప్రతి చోట ఈ చిత్రానికి పాజిటీవ్ రివ్యూలు వస్తున్నాయి. యశోద కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని.. అలానే యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్, బీజీఎం చాలా బాగా కుదిరాయని టాక్.
అయితే యశోద సినిమాకు ముందు నుంచి కూడా మంచి టాకే ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు అన్నీ కూడా మంచి స్పందన దక్కించుకున్నాయి. ఇక సమంతకు వచ్చిన వ్యాధి, ఆ వ్యాధితో బాధపడుతూనే డబ్బింగ్ చెప్పడం, ఆస్పత్రి నుంచి బయటకు రాలేని స్థితి, లేచి నిలబడలేని స్థితిలో ఉన్నా కూడా ప్రమోషన్స్‌కు రావడం, స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం, అందులో ఆమె కంటతడి పెట్టుకుంటూ చెప్పిన విషయాలు ప్రేక్షకులను కదిలించాయి. యశోద మీద మరింత పాజిటివిటీని పెంచాయి. దీంతో యశోదకి హిట్ టాక్ రావడం పై నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
End of Article