పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఒక హీరోగా మాత్రమే కాకుండా ఒక వ్యక్తిగా కూడా పవన్ కళ్యాణ్ ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. పవన్ కళ్యాణ్ సాధారణంగా ఇంటర్వ్యూలు ఇవ్వరు. సినిమా సందర్భంలో కూడా ప్రమోషన్స్ చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు.

Video Advertisement

అలాంటిది పవన్ కళ్యాణ్ ఒక షోలో కూర్చొని తన జీవితం గురించి మాట్లాడుతున్నారు అంటే ఇంక ఆసక్తి మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే అన్‌స్టాపబుల్ విత్ ఎన్ బి కె ఎపిసోడ్ విషయంలో జరిగింది. బాలకృష్ణ ఈ షో లో పవన్ కళ్యాణ్ ని ఎన్నో విషయాల గురించి ప్రశ్నలు అడిగారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా సమాధానాలు చెప్పారు. ఈ ఎపిసోడ్ మొదటి పార్ట్ ఇవాళ వచ్చింది. కానీ ఎపిసోడ్ వచ్చిన వెంటనే ఆహా యాప్ సర్వర్ క్రాష్ అయిపోయింది.

Trending memes on unstoppable with nbk Pawan Kalyan episode

అంతకుముందు ప్రభాస్ ఎపిసోడ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ విషయంలో కూడా ఇలా అవుతోంది. ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు. అలాగే హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కొంచెం సేపు వచ్చి ఈ ప్రోగ్రాం లో మాట్లాడారు. అసలు పవన్ కళ్యాణ్ ఇంత సరదాగా మాట్లాడుతూ ఉంటే చూడాలి అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17

#18