విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా. అంతకుముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయి పాన్ ఇండియన్ సినిమా గా రూపొందుతోంది. ఈ సినిమాతో అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మి, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు. దాదాపు గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసమే శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు అసలు మన తెలుగు తెరపై చూడని ఒక రకమైన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సినిమా బృందం చాలా నమ్మకంగా చెప్పింది. అయితే మళ్ళీ లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుయ్యింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో, అలాగే ఈ పిక్చర్ మీద వస్తున్న మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15