Ads
రోడ్ సేఫ్టీ వరల్డ్ టూర్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ లెజెండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ మరొక సారి తన సత్తా నిరూపించుకున్నారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఒకటే ఓవర్ లో 4 సిక్సులు చేసి ఇప్పటికి కూడా తన ఆటతీరు లో ఎటువంటి మార్పు రాలేదు అని రుజువు చేశారు యువరాజ్ సింగ్.
Video Advertisement
మహేంద్ర నాగముత్తూ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో మొదటి మూడు బంతులను డి సిక్సర్లు గా చేసిన యువరాజ్ సింగ్, అయిదవ అయిదవ బాల్ ని కూడా సిక్స్ గా మలిచారు. ఈ మ్యాచ్ లో ఒక ఫోర్, ఆరు సిక్సులు కొట్టిన యువరాజ్, 20 బంతుల్లో 49 పరుగుల స్కోర్ చేశారు. యూసుఫ్ పఠాన్ 20 బంతుల్లో 37 పరుగుల స్కోర్ చేయడంతో, భారత్ 218 పరుగులతో భారీ స్కోర్ నమోదు చేసింది.
ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. అంతకుముందు 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ బ్రాడ్ బౌలింగ్ లో ఓకే ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టారు యువరాజ్ సింగ్. ఇప్పుడు మళ్లీ దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ అలాగే రిపీట్ అయ్యింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3
#4#5#6#7
#8#9#10#11#12#13
End of Article