“యానిమల్” తర్వాత ఓటీటీలో ట్రెండ్ అవుతున్న రెండు సినిమాలు ఇవే…తప్పక చూడండి.!

“యానిమల్” తర్వాత ఓటీటీలో ట్రెండ్ అవుతున్న రెండు సినిమాలు ఇవే…తప్పక చూడండి.!

by Harika

ప్రస్తుతం థియేటర్లో విడుదలైన ప్రతి సినిమా కూడా ఓటిటి లో స్ట్రీమ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు ధియేటర్లో సంచలనం విజయం సాధించిన తర్వాత కూడా ఓటిటి లో అదే రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా ధియేటర్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా అక్కడ కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఓటిటి ప్లాట్ఫారం మీద ఉన్న ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక యానిమల్ తరహాలో మిగతా సినిమాలు కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తున్నాయి.

Video Advertisement

ప్రస్తుతం జీ5 లో సామ్ బహదూర్ అనే సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా  భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్‍ సామ్ మానెక్‌షా జీవితం ఆధారంగా ఆర్‌ఎస్‌విపి మూవీస్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా  నిర్మించారు.విక్కీ కౌషల్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, నీరజ్ కబీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యి యానిమల్ తరహాలో సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. జనవరి 26 నుండి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుండగా అక్కడ కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇక ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ శర్మ జీవితాన్ని ఆధారంగా “12th ఫెయిల్” తెరకెక్కగా అక్టోబర్ 27న విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకోగా ఓటిటి లో కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తుంది. డిసెంబర్ 29 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అన్ని భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే థియేటర్లో కన్నా ఓటిటి లోనే ఈ సినిమాకి మంచి ఆదరణ దొరికింది. తాజాగా ఓటిటి లో వచ్చిన సినిమాల్లో టాప్ త్రీ లో ఈ మూడు సినిమాలు ఉన్నాయి.


You may also like

Leave a Comment