Ads
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.మొదటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
ఈ చిత్రం జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రంలోని హనుమంతుడి(దేవదత్తా నాగే) కొత్త పోస్టర్ ను ఐదు భాషలలో ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. హిందీ మినహా మిగతా భాషల్లో ట్రాన్స్ లేషన్ తప్పు తప్పుగా వచ్చింది. “హమ్ హై కేసరి, క్యా బరాబరీ (మేము పులులం, మాకు సమానం లేదు)” అనే హిందీ వాక్యం మినహా, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో అనువాదం తప్పుగా వచ్చింది.
దీంతో నెటిజన్లు ట్రోలింగ్ కు దిగారు. “ప్రియమైన ఓం రౌత్, ఇది గిబ్బరిష్, తెలుగు కాదు. తెలుగు అనువాదానికి అర్థం లేదు” అంటూ ఓ నెటిజన్లు విమర్శించారు. “మీకు రామాయణం తెలియదు, మాకు అర్థమైంది. కానీ, కనీసం మిమ్మల్ని సరిదిద్దగల తెలుగు వ్యక్తిని నియమించుకోండి” అంటూ సూచించారు. తమిళ్, మలయాళంలోనూ లోపాలు ఉన్నాయని చాలా మంది నెటిజన్లు విమర్శించారు. మొత్తంగా ఓం రౌత్ అన్ని భాషలను చంపారని మరికొంత మంది ట్వీట్ చేశారు.
ఇంత ట్రోల్ అవుతున్నా, ఓం రౌత్ మాత్రం తన ట్వీట్ ను సరిచేసే ప్రయత్నం చేయకపోవడం విశేషం. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 6వ తేదీన తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు.
ఇక ఓం రౌత్ చేసిన ట్వీట్ పై వస్తున్న ట్రోల్స్ పై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
ALSO READ : “ఆదిపురుష్” ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా..?
End of Article