“ఇంకా ఎన్ని మ్యాచ్‌లు దేవుడికి ఇస్తారో.!” అంటూ … కోల్‌కతాపై ముంబై ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

“ఇంకా ఎన్ని మ్యాచ్‌లు దేవుడికి ఇస్తారో.!” అంటూ … కోల్‌కతాపై ముంబై ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

by Mohana Priya

అబుదాబి వేదికగా గురువారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి, ముంబై ఇండియన్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (7) ఫీల్డింగ్ ఎంచుకున్నారు. డికాక్ (55: 42 బంతుల్లో 4×4, 3×6) తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ (33: 30 బంతుల్లో 4×4) మ్యాచ్ ప్రారంభంలో దూకుడుగా ఆడారు. కానీ డికాక్ టాప్ గేర్‌ లోకి వెళ్లిన తర్వాత ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ లో అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5), ఇషాన్ కిషన్ (14),  కీరన్ పొలార్డ్ (21: 15 బంతుల్లో 2×4, 1×6), కృనాల్ పాండ్యా (12: 9 బంతుల్లో 1×6) ఆఖరి ఓవర్‌ లో వరుసగా అవుట్ అయ్యారు. దాంతో ముంబై ఇండియన్స్ జట్టు 155 స్కోర్ చేసింది.

Video Advertisement

mi vs kkr trolls

156 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో శుభమన్ గిల్ (13: 9 బంతుల్లో 1×4, 1×6), వెంకటేష్ అయ్యర్ (53: 30 బంతుల్లో 4×4, 3×6) చెరో సిక్స్ చేశారు. తర్వాత వచ్చిన బుమ్రా, ఆడమ్ మిల్నేకి బౌండరీల బాధ తప్పలేదు. రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్: 42 బంతుల్లో 8×4, 3×6) భారీ షాట్లతో దూసుకెళ్లారు. దాంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 15.1 ఓవర్లలోనే 159/3 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3
#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16


You may also like