నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమాలో జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ తదితరులు నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహించారు. టక్ జగదీష్ సినిమా మొదట థియేటర్లలో విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. చివరికి ఓటిటిలో రిలీజ్ అయ్యింది.

tuck jagadish review

భూదేవి పురంలో ఈ కథ అంతా నడుస్తుంది. జగదీష్ నాయుడు (నాని), బోస్ (జగపతి బాబు) అన్నదమ్ములు. వారి అక్కచెల్లెళ్ళు (రోహిణి, దేవదర్శిని). జగదీష్ మేనకోడలు చంద్ర (ఐశ్వర్య రాజేష్) జగదీష్ ని ఇష్టపడుతుంది. కానీ జగదీష్, గుమ్మడి వరలక్ష్మి (రీతు వర్మ) ని ఇష్టపడతాడు. జగదీష్ తండ్రి ఆదిశేష నాయుడు (నాజర్) చనిపోయిన తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోతాయి. అప్పుడు జగదీష్ ఏం చేశాడు? తన ఊరి సమస్యల్ని, అలాగే తన కుటుంబ సమస్యలను ఎలా పరిష్కరించాడు? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

tuck jagadish review

ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కుటుంబ విలువల చుట్టూ తిరుగుతుంది అనే విషయం అర్థమైపోయి ఉంటుంది. సినిమా చాలా స్లో గా మొదలవుతుంది. చాలా వరకు అలాగే సాగుతుంది కూడా. ఎక్కడా పెద్ద పెద్ద అరుపులు కానీ, చాలా పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ కానీ ఉండవు. వారి సంభాషణ అంతా కూడా మామూలుగా ఎలా మాట్లాడతారో అదే టోన్ లో నడుస్తుంది. కానీ సినిమా చూస్తున్నంత సేపు డీసెంట్ గా అలా సాగిపోతూనే ఉంటుంది. మధ్యలో సినిమా ఫ్లో ఎక్కడా డిస్టర్బ్ అవ్వదు. అలా లైటర్ నోట్ లో వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో స్టోరీ స్పీడ్ అందుకుంటుంది. అప్పటి వరకు ఉన్న పాత్రల తీరు కూడా సెకండ్ హాఫ్ లో మారుతాయి. ఒక రకంగా చెప్పాలంటే అసలు కథ అక్కడే మొదలవుతుంది.

tuck jagadish review

ఈ సినిమాకి ముఖ్య బలం మాత్రం నటీనటుల పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా నాని, జగపతి బాబు ఈ సినిమా తమ భుజాల మీద మోసారు. ఇంక మిగిలిన నటీనటులు రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్, రావు రమేష్, నరేష్, దేవదర్శిని, రోహిణి, డేనియల్ బాలాజీ (ఘర్షణ ఫేమ్) కూడా తమ పాత్రల్లో బానే నటించారు. తమన్ అందించిన సంగీతం, గోపీ సుందర్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకి సూట్ అయ్యేలా ఉన్నాయి. ఒకటి రెండు కంటే సినిమాలో పెద్దగా ట్విస్ట్ లాంటివేమీ ఉండవు. ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ సీన్స్ లో నాని నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఎటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, కుటుంబంతో కలిసి ఒకసారి మాత్రం సినిమా చూసేయొచ్చు.

భారీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమా చూస్తే టక్ జగదీష్ కచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే, ఈ సినిమా ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ యూత్ కి అంతగా నచ్చలేదు. మరొక బ్రహ్మోత్సవం అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ఒక లుక్ వేయండి.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.

#12.

#13