ఒక హీరోకి తన ముందు సినిమా టాక్ తో సంబంధం లేకుండా అభిమానులు పెరుగుతూ ఉండడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. ఇప్పుడు హీరో ప్రభాస్ విషయంలో కూడా అలాగే జరుగుతోంది. ప్రభాస్ బాహుబలి తర్వాత నటించిన రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
Video Advertisement
కానీ ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రేక్షకులకి తెలుసు కాబట్టి ప్రభాస్ నెక్స్ట్ సినిమా కచ్చితంగా బాగుంటుంది అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరో కావడంతో తెలుగు వారితో మాత్రమే కాకుండా హిందీ దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ సినిమాలో నటించారు.
ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో రాముడు పాత్రలో ప్రభాస్ నటించారు. సీత పాత్రలో కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆలస్యం అయ్యింది. సినిమా టీజర్ విడుదల అయిన తర్వాత చాలా మంది గ్రాఫిక్స్ పై కామెంట్స్ చేశారు.
దాంతో సినిమా బృందం అంతా కూడా సినిమాపై మళ్ళీ పని చేసి, ఎక్కడ అయితే కామెంట్స్ వచ్చాయో ఆ విషయాలపై జాగ్రత్త తీసుకొని, సినిమా కొంచెం ఆలస్యంగా విడుదల చేస్తున్నాం అని అన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చేసిన మార్పులకి కూడా చాలా కోట్లలో ఖర్చు అయ్యింది అని సమాచారం. సినిమా విడుదల ఆలస్యం అయినా పర్లేదు కానీ సినిమా బాగుంటే చాలు అని చాలా మంది అన్నారు.
అయితే ఇవాళ శ్రీ రామ నవమి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు. అందులో రాముడు, సీత, లక్ష్మణుడుతో పాటు హనుమంతుడు ఉన్నారు. అయితే ఈ పోస్టర్ చూసి కొంత మంది ముందు విడుదల అయిన పోస్టర్స్ కంటే ఇది బాగుంది అని అంటే, మరి కొంతమంది మాత్రం అంత ఖర్చు పెట్టారు కానీ ఏం మార్చారు? ఎడిటింగ్ అలాగే అంతకుముందు పోస్టర్స్ కి ఉన్నట్టే ఉంది కదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18